సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక, మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, రఘునందన్ ఈ వార్తలపై స్పందించారు.
పార్టీ మార్పు వార్తపై తాజాగా రఘునందన్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్‌లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు.
ఇక, ఏదోఒక రోజు సమయం చూసుకుని, డేట్ చెప్పకుండా గజ్వేల్‌కు వస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదు. ఈ విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: రేవంత్ Vs కవిత.. మాటల వార్‌తో దద్దరిల్లిన ట్విట్టర్
Comments
Please login to add a commentAdd a comment