సాక్షి, సిద్దిపేట: దుబ్బాక మండలం హబ్సిపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోడౌన్ ప్రారంభోవోత్సవలో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు సర్దిచెప్పారు.
బస్టాండ్ వేదికగా దుబ్బాకలో రాజకీయాలు వేడేక్కాయి. ఉప ఎన్నిక సమయంలో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు అప్పట్లో హామీ ఇచ్చాయి. అనుకున్నట్లుగానే సకల హంగులతో రూ. 4కోట్ల వ్యయంతో ఏడాదిన్నర కాలంలోపే నిర్మాణం పూర్తి చేశారు. దుబ్బాక బస్టాండ్‌ను మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో బస్టాండ్ క్రెడిన్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతుంటే.. తాను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్లే బస్టాండ్ పూర్తైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.
దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ నెలకొంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పొలిటికల్ హీట్ రాజుకుంది. బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నూతన బస్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లోకి బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలకు ప్రవేశం నిషేధించారు. బస్టాండ్ ప్రాంగణంలోకి ఎవ్వరిని అనుమతించలేదు. సిద్ధిపేట సీపీ శ్వేతా దుబ్బాక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్టాండ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లకు డ్రెస్‌కోడ్ పెట్టారు పోలీసులు.
చదవండి: Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
చదవండి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
Comments
Please login to add a commentAdd a comment