హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్చే రఘునందనరావు సవాల్ విసిరారు. తాను సూచించిన రెండు పథకాల్ని దుబ్బాక నియోజకవర్గంలో అమలు చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు రఘునందన్.దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దళితబంధు ఇవ్వడంతో పాటు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ. 7.5 లక్షలు ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాల్ని అమలు చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మంత్రి కేటీఆర్‌కు ఓపెన్ చాలెంజ్ చేశారు రఘునందన్.
కాగా, 2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది. అప్పటి వరకు కారు స్పీడ్‌కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఊపు తెచ్చింది మాత్రం కచ్చితంగా దుబ్బాక ఎమ్మెల్యే సీటు అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment