
సాక్షి, సంగారెడ్డి : మెదక్‌లో గెలిచి ఆ విజయాన్ని సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామంటూ సంగారెడ్డి ఎంపీ అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభాకర్ రెడ్డి శనివారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి రెండవసారి అవకాశం కల్పిచినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి ఓటమిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులు పూర్తవ్వాలంటే.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలవాలని స్పష్టం చేశారు. సంగారెడ్డికి ఎంఎంటీఎస్ సౌకర్యాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం పూర్తయితే సంగారెడ్డికి పుష్కలంగా నీళ్లు లభిస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment