సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ బీఆర్ఎఎస్‌లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై సొంతపార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేశారు. మూడోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను మార్చకపోతే, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
‘ఎమ్మెల్యే శంకర్‌నాయ క్‌ను రెండు సార్లు గెలిపిస్తే కార్యకర్తలను అణ గతొక్కారు. భూ కబ్జాలు, రక్తపాతాలు సృష్టించారు. ఇటువంటి నేర చరిత్ర ఉన్న శంకర్ నాయక్‌కు ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్దు.... కొత్త అభ్యర్థి కి టికెట్ ఇవ్వాలి’ అంటూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వర్గీయులు, మానుకోట బీఆర్‌ఎస్ నాయకులు తీర్మానం చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
శనివారం మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో ముగ్గురు మహబూబాబాద్ ము న్సిపల్ కౌన్సిలర్లు, ఒక కో–ఆప్షన్ సభ్యుడు, కేసముద్రం సర్పంచ్‌తో పాటు మహబూబా బాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మండలాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మా ర్కెట్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.
బినామీలకే పెద్దపీట వేశారు..
మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ హరిసింగ్ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న శంకర్‌నాయక్‌కు కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మరోసారి శంకర్‌నాయక్‌ను గెలిపిస్తే బిహార్‌ను తలపించేలా మానుకోటలో అరాచకాలు సృష్టిస్తారని ఎడ్ల రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మానుకోటలో అభ్యర్థిని మార్చి కొత్తవారికి టికెట్ ఇస్తే కానీ బీఆర్‌ఎస్ మళ్లీ గెలవదని నాయకులు రవీంద్రాచారి, ఎడ్లవేణు, కన్నా, జెర్రిపోతులు వెంకన్న, నిమ్మలశ్రీనివాస్ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనుచరులు జెడ్పీటీసీ రావుల శ్రీనా«థ్‌రెడ్డి, ఎంపీపీలు.. కేసముద్రంలో సమావేశమై ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికావని, ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
చదవండి: పోరాడండి.. తోడుగా ఉంటాం.. ఈటలకు మోదీ భరోసా
Comments
Please login to add a commentAdd a comment