shankar nayak
-
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాకొద్దు.. సొంత పార్టీ నాయకుల సంచలన ఆరోపణలు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ బీఆర్ఎఎస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై సొంతపార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేశారు. మూడోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను మార్చకపోతే, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ‘ఎమ్మెల్యే శంకర్‌నాయ క్‌ను రెండు సార్లు గెలిపిస్తే కార్యకర్తలను అణ గతొక్కారు. భూ కబ్జాలు, రక్తపాతాలు సృష్టించారు. ఇటువంటి నేర చరిత్ర ఉన్న శంకర్ నాయక్‌కు ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్దు.... కొత్త అభ్యర్థి కి టికెట్ ఇవ్వాలి’ అంటూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు వర్గీయులు, మానుకోట బీఆర్ఎస్ నాయకులు తీర్మానం చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో ముగ్గురు మహబూబాబాద్ ము న్సిపల్ కౌన్సిలర్లు, ఒక కో–ఆప్షన్ సభ్యుడు, కేసముద్రం సర్పంచ్‌తో పాటు మహబూబా బాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మండలాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మా ర్కెట్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. బినామీలకే పెద్దపీట వేశారు.. మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ హరిసింగ్ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న శంకర్‌నాయక్‌కు కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మరోసారి శంకర్‌నాయక్‌ను గెలిపిస్తే బిహార్‌ను తలపించేలా మానుకోటలో అరాచకాలు సృష్టిస్తారని ఎడ్ల రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మానుకోటలో అభ్యర్థిని మార్చి కొత్తవారికి టికెట్ ఇస్తే కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవదని నాయకులు రవీంద్రాచారి, ఎడ్లవేణు, కన్నా, జెర్రిపోతులు వెంకన్న, నిమ్మలశ్రీనివాస్ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనుచరులు జెడ్పీటీసీ రావుల శ్రీనా«థ్‌రెడ్డి, ఎంపీపీలు.. కేసముద్రంలో సమావేశమై ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికావని, ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: పోరాడండి.. తోడుగా ఉంటాం.. ఈటలకు మోదీ భరోసా -
కేటీఆర్ అసంతృప్తి.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్
-
కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. జిల్లాలోని మానుకోటలో రూ. 50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్‌తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ఎమ్మెల్యే చేయిని మంత్రి తీసి పడేశారు. కేటీఆర్ సీరియస్‌గా షాక్ ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఇక పోడు పట్టాల పంపిణీ సభా వేదికపై కేటీఆర్‌కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. సభాముఖంగా జరిగిన అవమానంతో ఎమ్మెల్యే నరేందర్ వేదికపై చిన్నబోయి కూర్చున్నాడు. అయితే పట్టణంలో పర్యటించిన కేటీఆర్‌కు జర్నలిస్టులతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చదవండి: ‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’ -
సారథి కావలెను: టీఆర్ఎస్ అధిష్టానం రహస్య సర్వే!
సాక్షి, మహబూబాబాద్: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. పార్టీలో మూడు వర్గాలు, నాలుగు గ్రూపులుగా ఉన్న నాయకులను ఒకే తాటిపై తెచ్చి అందరిని సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించే నాయకుడి అవసరం అనివార్యమైంది. అయితే ప్రస్తుతం పార్టీలో వర్గాల వారీగా ఎవరికీ వారు తమ అనుచరుల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, వారిని పార్టీ అధినేత వద్దకు తీసుకెళ్లి పరిచయం చేయించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని నడిపించేందుకు అంగ, ఆర్థికబలం ఉన్న నాయకుడి కోసం పార్టీ అన్వేషిస్తుందని సమాచారం. కావునా నాయకులు చెప్పిన వారినే కాకుండా జిల్లాలోని మంచి నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ రహస్యంగా సర్వే చేయించి నివేదిక తెప్పించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇలా మరి కొద్దిరోజుల్లో భర్తీ కానున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పీఠం ఎవరికి దక్కుతుందో.. ఏ వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా నాయకుడు అవుతాడో అనేది చర్చగా మారింది. ఎవరికి వారుగా ప్రతిపాదనలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి పదవి తమ అనుచరులకు దక్కించుకునేందుకు జిల్లా నేతలు పోటీ పడుతున్నట్లు కన్పిస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రభావితం చేసే నాయకుడు మహబూబాబాద్ నుంచి ఉంటే బాగుంటుందనే ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తమ అనుచరుల పేర్లను ఇప్పటికే అధిష్టానానికి సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. ఇందులో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న పేర్లు ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నట్లు ప్రచారం. అయితే పాల్వాయి రాంమోహన్‌రెడ్డి ఇందుకు సుముఖంగా లేడనే వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కూడా తమ అనుచరుడికి పీఠం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మహబూబాబాద్ మండలానికి చెందిన కేఎస్ఎన్రెడ్డి, ముత్యం వెంకన్న పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం. కేఎస్ఎన్ రెడ్డిని పార్టీ వర్కింగింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారని తెలిసింది. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులైన గుడిపూడి నవీన్‌రావు, రాంసహాయం రంగారెడ్డి పేర్లు కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెలిసింది. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా తమ అనుచర వర్గంలోని నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కొమ్మినేని రవీందర్ పేర్లు పరిశీలించి పార్టీ అధిష్టానానికి పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మంత్రి వర్గీయుల్లో చర్చ. ఇదిలా ఉండగా జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన బీరవెల్లి భరత్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పేర్లు కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు మహబూబాబాద్ పట్టణం తర్వాత రెండో పెద్ద పట్టణమైన తొర్రూరు కూడా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇందుకోసం తొర్రూరు ప్రాంతం నుంచి డాక్టర్ పోనుగోటి సోమేశ్వర్రావుకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నట్లు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు చెబుతున్నారు. సమన్వయంతో పనిచేసే వారికే.. టీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవి ముళ్ల కిరీటంలా మారింది. అందరిని ఏకతాటిపైకి తీసుకురావడమంటే కత్తిమీద సాములాంటిదే. ఈ క్రమంలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీని నడిపించే సమర్థుడి కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జిల్లాపై పట్టు ఉండి అందరితో కలిసిపోయి క్యాడర్లో కొత్త జోష్ తీసుకొచ్చే నాయకుడు కావాలి. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానిని కట్టడి చేస్తూ కొత్త క్యాడర్‌ను పార్టీలోకి తీసుకునేలా ఎత్తుగడలు వేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది పార్టీని నడిపించాలంటే ఆర్థిక పరిపుష్టి కూడా కీలకంగా పరిగణిస్తున్నారు. ఇన్ని లక్షణాలు ఉన్న నాయకుడి కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు వేచిచూస్తున్నారు. చదవండి: హుజూరాబాద్ ఉపఎన్నిక: కాంగ్రెస్ నుంచి ఈ పరిణామం ఉహించలేదు -
అటవీశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
-
దొరల రాజ్యం ఇంకెంత కాలమో?
మహబూబాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు’అంటూ వ్యాఖ్యానించారు. తాను ఏం మాట్లాడినా తప్పే అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చొరవతో మిర్చి నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ త్వరలోనే ఏర్పాటు కానుందని చెప్పారు. అయితే, వేదికపై ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు కలుగచేసుకుని ఆ ఫ్యాక్టరీ పనులు డోర్నకల్ నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏం రాజ్యాంగమో, ఎవరు కనిపెట్టారో తెలియదు.. అన్నం పెట్టే రైతుకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందన్నారు. అన్నం లేకుంటే బతకలేరని ప్రతి ఒక్కరికీ తెలుసు.. అయినా రైతును మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసేవారిని ఉరి శిక్ష విధించాలన్నారు. గుండు పిన్ను నుంచి వస్తువులను తయారు చేసే వారే ధరలను నిర్ణయిస్తారని, రైతుకు మాత్రం ఆ అవకాశం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా, శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మంత్రి సత్యవతి రాథోడ్ పక్కనే ఉన్నారు. -
ఎమ్మెల్యే రాకుండానే రివ్యూ మీటింగ్
-
మానుకోట గులాబీలో గలాటా!
సాక్షి, మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య అంతర్గత విభేదాలు బుధవారం మరోసారి బహిర్గతమయ్యాయి. ఎస్సారెస్పీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అధికారుల ఎదుటే మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నన్ను పిలవకుండానే సమావేశమా? మధ్యాహ్నం 12.30కి సమీక్ష ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అక్కడకొచ్చి తనకు సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహిం చడం దారుణమని, స్థానిక సమస్యలు తెలియకుండా సమీక్షా సమావేశాలు పెట్టి చాయ్, బిస్కె ట్లు తిని ఫొటోలకు ఫోజులిస్తే ప్రయోజనం ఉండ దని మంత్రిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించా రు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ ‘మనం ముందుగానే అనుకున్నాం కదా? సమీక్ష గురించి తెలుసు కదా’అని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే.. తాను రాకుండానే ఎందుకు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డురోలర్ మీద, ఎర్ర బస్సు ఎక్కి రాలేదని.. ఆర్ఈసీలో చదివి రాజకీయాల్లోకి వచ్చానంటూ శంకర్ నాయక్ మంత్రి విద్యాభ్యాసంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రి అసహనంతో ‘ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మీ సమస్యలు ఏంటో చెప్పండి చర్చిద్దాం’అని బదులిచ్చారు. అప్పుడే కలెక్టర్ వీపీ గౌతమ్ జోక్యం చేసుకొని ‘సమన్వయ లోపం జరిగింది.. సారీ సర్’అని ఎమ్మెల్యేకు సర్ది చెప్పారు. -
కలబడ్డవారు.. కలిసిపోయారు
సాక్షి, మహబూబాబాద్: గత ఎన్నికల్లో వారు పోటాపోటీగా బరిలో నిలిచారు. ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా వ్యూహాలు పన్నారు. కాలంగిర్రున తిరిగింది. ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవటం.. ఇతర కారణాలేవైనా ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. గత ఎన్నికల్లో ఎవరినైతే ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారో ఇప్పుడు వారికే మద్దతుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వారి గెలుపుకోసం స్వయంగా ప్రచారం చేస్తున్నారు. కత్తులు దూసుకున్నవారే 2014 ఎన్నికల్లో మానుకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాలోతు కవిత, టీఆర్ఎస్ తరఫున శంకర్‌నాయక్ తలపడ్డారు. డోర్నకల్‌లో కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, టీఆర్ఎస్ నుంచి సత్యవతి రాథోడ్ పోటీపడ్డారు. మారిన రాజకీయ సమీకరణలతో గెలిచిన రెడ్యానాయక్, ఓడిపోయిన మాలోతు కవిత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎడమోహం పెడమోహంలాగా కొనసాగారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలు సైతం చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ కోసం ఇరువురు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చారు. దీంతో వీరు సహాయ నిరాకరణ చేశారు. కేసీఆర్, కేటీఆర్ అసంతృప్తులతో మాట్లాడి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని ఆదేశించారు. దీంతో మాలోత్ కవిత తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయకు మద్దతుగా, సత్యవతి రాథోడ్ రెడ్యానాయక్ గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం ప్రచారం నియోజకవర్గ సమన్వయ సమావేశం ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఇటీవల నిర్వహించారు. కడియం ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీని గెలిపించండి భవిష్యత్‌లో మీకు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అలకవీడిన సత్యవతి, కవిత టీఆర్ఎస్ అభ్యర్థుల గెలపుకోసం నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. -
శంకర్‌నాయక్‌ను నిలదీసిన రైతులు
సాక్షి, మహబూబాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థి, మానుకోట తాజామాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌కు మానుకోట మండలంలోని అయోధ్య గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌నాయక్ అయోధ్య గ్రామానికి వెళ్లగా రైతులు, గ్రామస్తులు, గ్రామ పొలిమేరలోనే అడ్డుకుని నిరసన తెలిపారు. ఎస్సీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని శంకర్‌నాయక్‌ను బాధిత రైతులు అడుగుతున్న సందర్భంలో రైతులు, టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినా గ్రామస్తులు తమకు రైతుబంధు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం రాలేదని శంకర్‌నాయక్‌ను నిలదీశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని దళితులకు ప్రభుత్వ భూమి ఇచ్చారని, వాటికి ఎందుకు రైతుబంధు, రైతుభీమా వర్తింపజేయలేదని ప్రజ లు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రుణాలు ఇచ్చారని, వాటిని మాఫీ కూడా చేశారన్నారు. అలాంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దళితుల పట్ల చిన్నచూపు చూస్తూ అన్యా యం చేసిందని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకి మాధవరావు కలెక్టర్‌గా ఉన్న సమయంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక్కొక్కరికి 4, 5 ఎకరాల చొప్పున ఇచ్చారని రైతులు తెలిపారు. సుమారు 70 ఏళ్లపైబడి నుంచి తమకు ఆ భూములపై పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నామని, ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దళిత రైతులను అక్కడ నుంచి పక్కకు పంపించారు. గ్రామంలో ప్రచారం అనంతరం వచ్చి ప్రజలకు సమాధానం చెబుతానని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చెప్పి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో చిన్నారులు మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ గురువారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచా రంలో చిన్నారులు, స్కూల్ విద్యార్థులు టీఆర్ఎస్ కండువా, టోపీలు ధరించి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థితో పాటు తిరిగారు. ఓటు హక్కులేని పిల్లలను ఎన్నికల ప్రచారంలో తిప్పకూడదనే నిబంధన ఉన్పటికీ పిల్లలను ప్రచారంలో తిప్పుతూ ఎన్నికల సంఘం నిబంధనలను శంకర్ నాయక్ తుంగలో తొక్కారు. టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌తో ఎన్నికల ప్రచారంలో పిల్లలు -
శంకర్‌నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తమ్మినేని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అనుచిత ప్రవర్తన తదనంతర పరిణామాల నేపథ్యంలో అక్కడి ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశా రు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపిం చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఓ ప్రక టన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ స్పందించడం, కేసు పెట్టడం, బెయిల్‌పై విడుదల కావడం వెంట వెంటనే జరిగాయని అన్నారు. ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెత్తనం చలాయించడంవంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. గతంలో కరీంనగర్, వరంగల్, నిజామా బాద్ జిల్లాల్లో ఇదే తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. -
35 మంది ఐఏఎస్‌లు.. 7 గంటలు..
మహబూబాబాద్ ఘటన నేపథ్యంలో భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. మహబుబాబాద్ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించినందుకు సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని, అలాగే దర్యాప్తు పక్రియ పారదర్శకంగా చేపట్టాలని పోలీసులను కోరారు. సమావేశంలో కేవలం మహబుబాబాద్ ఘటనే కాకుండా పలు అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లాస్థాయిలో కొందరు రాజకీయ నాయకులతో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులపైనా చర్చించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఐఏఎస్ అధికారుల సంఘం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలవనుంది. -
ఎమ్మెల్యే నాయక్ అరెస్టు, బెయిలు
విచారణాధికారిగా తొర్రూరు డీఎస్పీ ► కలెక్టర్ తదితరుల వాంగ్మూలం నమోదు ► ఎమ్మెల్యే తీరుపై జిల్లాలో విపక్షాల ఆందోళన సాక్షి, మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ ప్రీతీ మీనాతో అనుచితంగా ప్రవర్తించిన మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉదయం ఆయన కేసముద్రం మండలంలో హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. అరెస్టు అనంతరం ఆయన్ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అడ్డుకోవచ్చనే అంచనాతో భారీ బందోబస్తు కల్పించారు. అంతకుముందు బుధవారం అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యేపై పోలీసులు ఐపీసీ 353 (ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించడం), 354 (మహిళలతో ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించడం), 509 (బహిరంగ ప్రదేశంలో మహిళ అని కూడా చూడకుండా అవమానపరచడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ బి.రాజారత్నంను విచారణాధికారిగా జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి నియమించారు. సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా, యాదృచ్ఛికంగానా అన్నదానిపై డీఎస్పీ విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. దాని ఆధారంగా కేసులపై దర్యాప్తు ముందుకు సాగుతుంది. విచారణ ప్రారంభం ఘటనపై డీఎస్పీ విచారణ ప్రారంభించారు. కలెక్టర్ ప్రీతీ మీనా, జేసీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. మరోవైపు కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ ప్రతిపక్షాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాస్తారోకోలు జరిపారు. ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
‘దళితులపై దాడులను పట్టించుకోని సీఎం’
హైదరాబాద్: దళితులపై దాడులు జరుగుతున్నా వాటిని నిరోధించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) నేత వడిత్యా శంకర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. అమలాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవు చర్మాన్ని తొలగిస్తున్న దళితులపై అత్యంత దారుణంగా దాడి చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు. -
వెయ్యి రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం
కోల్‌కతా నుంచి వెయ్యి రూపాయల నకిలీ నోట్లు తెస్తున్న ఓ వ్యక్తిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారంతండాకు చెందిన కరంటోతు కిషన్(48), రేగోడ్ మండలం జంగంలంకతండాకు చెందిన శంకర్‌నాయక్ స్నేహితులు. ఈ క్రమంలో శంకర్‌నాయక్ వారం కిత్రం కిషన్‌కు రూ.50 నగదు ఇచ్చి కోల్‌కతా సమీపంలోని హౌరాలో ఉన్న గౌసుద్దీన్ అనే వ్యక్తి వద్దకు పంపిచాండు. అతడు వెళ్లి గౌసుద్దీన్‌కు ఆ నగదు ఇవ్వగా...అతడు ఇచ్చిన నకిలీ వెయ్యిరూపాయల నోట్లు రూ.1.10 లక్షలు తీసుకుని శనివారం దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో దిగాడు. విశ్వనీయ సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్‌లో కిషన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతని వద్ద నుంచి లక్షా పదివేల నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కిషన్ గతంలో రూ.3 లక్షల నకిలీ వెయ్యి నోట్లు హౌరా నుంచి తెచ్చినట్లు విచారణలో తేలింది. శంకర్‌నాయక్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
మీ భూమి.. తప్పుల తడక!
అవుకు మండలం మంగంపేట తండాకు చెందిన కొర్ర శంకర్ నాయక్‌కు రామావరం సమీపంలోని వజ్రగిరి ప్రాంతంలో 143 సర్వే నంబర్లో 1.26 ఎకరాల భూమి ఉంది. అనారోగ్య కారణంగా ఈయన 2009వ సంవత్సరంలో మృతి చెందాడు. ఈ రైతు కుమారుడు శ్రీనివాసనాయక్ తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం సంబంధింత రెవెన్యూ కార్యాలయంలో అందజేశాడు. మీ భూమి వెబ్సైట్లో మృతిచెందిన శంకర్‌నాయక్ పేరుమీదనే భూమి ఉన్నట్లు పొందుపరిచారు. దొర్నిపాడుకు చెందిన భూపనపాడి రోషమ్మకు 1093 సర్వే నంబర్లో 2 ఎకరాల మెట్ట పొలం ఉంది. మీ భూమి వెబ్ సైట్ ఆమె ఇంటిపేరు భూపాటి రోషమ్మగా నమోదు చేశారు. సాక్షి, కర్నూలు: ..వీరే కాదు జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన మీ భూమి వెబ్సైట్లో తప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను బతిమాలకుండా, కాళ్లు అరిగేలా తిరగకుండా వారి భూమి వివరాలు వారే చూసుకునేలా ప్రభుత్వం ‘మీ భూమి’ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించడం వరకు బాగానే ఉన్నా.. వైబ్‌సైట్‌ను క్లిక్ చేసిన వాళ్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. భూముల సమాచారం అంతా తప్పుల తడకగా ఉండడమే ఇందుకు కారణం. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయకపోవడం తమకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందంటున్నారు రైతులు. రైతులు తమ భూమి వివరాలు తాము తెలుసుకోవాలంటే గతంలో రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ అధికారులకు అమ్యామ్యాలు చెల్లించాల్సి ఉండేది.. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, మీ-సేవ ద్వారా రెవెన్యూ సేవలు, వెబ్‌ల్యాండ్ వంటి మార్పులు జరిగిన తర్వాత ఈ పరిస్థితి మారినా ఇంకా ఇబ్బందులు తప్పలేదు. భూ ముల వివరాలు తెలుసుకునే చిన్నపనికి సైతం ఇళ్లు-ఊరు విడిచి వెళ్లాల్సి రావడంపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. ఇంటర్నెట్ సౌకర్యం మారుమూల గ్రామాలకు విస్తరించిన నేపథ్యంలో అరచేతిలో సైతం భూమి వివరాలు తెలుసుకునే దిశగా వెబ్‌సైట్‌ను, మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్(యాప్)ను రూపొం దించి ‘మీ భూమి’ కార్యక్రమం పేరిట ప్రభుత్వం ప్రారంభించింది. భూములకు సంబంధించిన అడంగల్, 1బి, భూమి కొలతల రికార్డు(ఎఫ్ఎంబీ), గ్రామపటాల వివరాలు నమోదు చేసి ఆన్లైన్ చేశారు. మన భూమి వెబ్సైట్ ఆరంభించి అందరూ చూసుకునే సేవలు వెంటనే అందుబాటులోకి వచ్చాయి. తప్పుల తడక.. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా దాదాపు 7 లక్షల 1బి ఖాతాలున్నట్లు సమాచారం. అడంగల్ ఖాతాలు 13 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు రికార్డుల్లోనూ దాదాపు 30 శాతంపైగా తప్పులున్నట్లు రెవెన్యూ అధికారులే అభిప్రాయపడుతుండడం గమనార్హం. వాస్తవానికి రికార్డుల్లో ఇప్పుడు సాగులో ఉన్న, భూమి అనుభవిస్తున్న చాలామంది రైతుల పేర్లు లేవు. వారసత్వంగా సంక్రమించిన భూముల్లో తాతా, ముత్తాతల పేర్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన వారి పేరున సైతం భూమార్పిడి జరగలేదు. ఆన్లైన్ సమయంలో కూడా ఎన్నో తప్పులు దొర్లాయి. కాగితపు రికార్డుల్లో ఉన్నట్లు కాకుండా రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం కూడా తప్పులుగా నమోదు చేశారు. ప్రతి నెలా వందల సంఖ్యలో మార్పు, సవరణలకు దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం. ఆ మండలం, ఈ మండలం అని తేడా లేకుండా అన్ని చోట్లా రికార్డుల్లో తప్పులు పరిపాటిగా మారాయి. వీటినే రెండేళ్ల కిందట ఆన్లైన్ చేశారు. వాటినే వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల పెట్టారు. ఈ కారణంగా ఇప్పటికే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మార్పు కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు మీ భూమి వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. తాజా రికార్డులు నమోదు చేయకుండా వెబ్‌ల్యాండ్ ప్రారంభించడం వల్ల రైతులకు ఒనగూరేదేమీ లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
అనంతపురం కల్చరల్: రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోతున్న గిరిజనులు రాజ్యాధికారమే లక్ష్యంగా ఐక్యంగా ఉద్యమించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు. జీవీఎస్ ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్ ప్రాంగణంలో శుక్రవారం రాజ్యాధికార భారీ బహిరంగ సభ నిర్వహించారు. జీవీఎస్ రాయలసీమ కన్వీనర్ మల్లికార్జున నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరామ్‌నాయక్, జీవీఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు నాగరాణి, సోనాబాయి, ఎంపీపీ వెంకటమ్మబాయి, ఎస్కేయూ అధ్యక్షులు నారాయణస్వామి, సురేష్‌నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణస్వామి నాయక్ శ్రీనానాయక్, ఎంఆర్పిఎస్ నాయకులు శంకర్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్రంగా స్పందించారు. దశాబ్దాలుగా గిరి జనులు ఓట్లువేసేందుకే పరిమితం కాగా ఓట్లు వేయించుకున్న వారు పాలకులుగా మారి పదవుల్లో ఊరేగుతూ తమను అణగదొక్కుతున్నారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలనిచ్చి ఏ ఒక్కదానిని నెరవేర్చకుండా గిరిజనులను మోసం చేసారని వి మర్శించారు. గిరిజన విద్యార్థులు చాలా చోట్ల కూలీలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 500 జనాభా కల్గిన బంజారా తండాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని తీర్మానించినా అనంతరం వచ్చిన నేతలు దానిని పట్టించుకోలేదన్నారు.రాష్ట్రాలలో పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని, జిల్లాలో గిరిజనులకు 2 ఎమ్మెల్యే, ఒకటి చొప్పున ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ,ఎస్సీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సదస్సులో ప్రజా కళాకారుడు బిక్షు నాయక్ బృందం బంజారా పాటలతో ఆహూతులను అలరించారు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమ జిల్లాలు, రాష్ట్రాల నుంచి విచ్చేసిన గిరిజన తండాల యువత, మహిళలతో ప్రాంగణం కిటకిటలాడింది. కార్యక్రమంలో మణికంఠనాయక్, గనే నాయక్, ప్రభాకర్ నాయక్, చంద్రానాయక్, సాకే పవన్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హన్మకొండ : ‘జూరాల-పాకాల’కు అడుగు పడేనా..‘దేవాదుల’ వేగిరమయ్యేనా... ‘కంతనపల్లి’కి నిధులు వచ్చేనా..ఇండస్ట్రియల్ కారిడార్‌కు స్థానం దక్కేనా....ఇలా తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశతో ఉన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ‘తొలి’ అడుగుతో దశ తిరిగేనా అని కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతిలోని మంత్రదండం జిల్లాకు నిధుల వరద పారించేనా అని ముందస్తుగా లెక్కలు వేస్తున్నారు. జిల్లా ప్రజల్లో భారీ అంచనాలు ఉండడంతో జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఆరూరి రమేశ్ బడ్జెట్ సమావేశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ నియోజకవర్గాలకు ఏ మేరకు నిధులు వస్తాయోనని అంచనాల్లో మునిగారు. ఇప్పటికే మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు వివిధ స్థాయిల్లో చేపట్టాల్సిన పనులు, నిధుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. వీటితోపాటు జూరాల-పాకాల, వాటర్‌గ్రిడ్, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటి ఆధారంగా జిల్లాకు పలు పథకాలు, నిధులను బడ్జెట్ సమావేశాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది. సాగునీటికి పెద్దపీట తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు దివరకే స్పష్టం చేసింది. జిల్లాలో 5,61,229 ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పదేళ్ల కిందట ప్రారంభించినా... పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు పూర్తి కాలేదు. మూడు దశల్లో రూ. 9,427 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా... గడువు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో నిర్మాణ వ్యయం అదనంగా రూ. 1976 కోట్లు పెరిగింది. మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో, మూడో దశ పనులు ఏళ్లు గడిచినా.. కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత బహుళార్ధక ప్రాజెక్టుగా ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కంతనపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కంతనపల్లికి సంబంధించిన డిటైల్డ్ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 2014 ఆగస్టులో ప్రభుత్వానికి పంపించారు. మొత్తం 131 గేట్లతో అతి పెద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్లాన్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగం చేసేలా ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించేందుకు ఆస్కారం ఉంది. కంతనపల్లి పూర్తయితే దేవాదుల ప్రాజెకు ్టద్వారా ఎక్కువ రోజుల నీటిని వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో జిల్లా ఉన్నప్పటికీ ఒక్క చుక్క వాటా కూడా వరంగల్ జిల్లాకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జూరాల-పాకాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తే... ఏకంగా 3.60 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే వీలుంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల నుంచి కృష్ణానది నీళ్లను మహబూబ్‌నగర్, నల్లగొండ మీదుగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల వరకు తీసుకొస్తారు. ఈ మూడు ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ చిక్కులు తీరేనా... హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండిస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి పరచడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటిగా ఉంది. దీనికనుగుణంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి, కార్యక్రమాల విస్తరణ, పెండింగ్‌లో ఉన్న వ్యాగన్ పరిశ్రమకు భూమి కేటాయింపు, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్‌గా మార్చే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ గ్రేటర్ ప్రకటన వెలువడే ఉంది. అదేవిధంగా... నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు. చెరువుల అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునురుద్ధరణ, తాగునీటి పథకాలకు (వాటర్‌గ్రిడ్) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లాలో మొత్తం 1400 చెరువులు ఉన్నాయి. వీటిలో మొదటిదశ కింద 250 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. వీటికి దాదాపు రూ.500 కోట్ల వ్యయం అవుతుంద ంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటర్‌గ్రిడ్‌లో భాగంగా జిల్లాలో సుమారు రూ 5,700 కోట్ల వ్యయంతో ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేసి... జిల్లాలో అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి దశకు సంబంధించిన నిధులు ఈ బడ్జెట్లో మంజూరయ్యే అవకాశం ఉంది. -
అయినా మారలేదు
- రూ.15 వేలు లంచం తీసుకుంటూ.. - ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ - ఇది రెండోసారి.. ఓ సారి ఏసీబీకి చిక్కి సస్పెండయినా... ఆ అధికారి తీరు మారలేదు. ‘జూనియర్’ స్థాయిలో చేసిన తప్పునే ‘సీనియర్’ స్థాయిలోనూ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. కరీంనగర్ క్రైం : చెట్లు ఎక్కేందుకు లెసైన్స్ కోసం ఓ గీత కార్మికుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిరిసిల్ల మండలం జిల్లెల్లకు చెందిన కందుకూరి హన్మండ్లు అనే గీతకార్మికుడు జూన్ 9న తాటిచెట్లు ఎక్కేందుకు లెసైన్స్ కావాలని కోరుతూ జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 3న తన దరఖాస్తు గురించి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఎన్.శంకర్‌ను కలవగా దరఖాస్తు కనిపించడం లేదని, మళ్లీ ఇవ్వాలని సూచించాడు. మళ్లీ దరఖాస్తు చేయగా రూ.3 వేలు ఇస్తే ఫైల్‌ను పై అధికారులకు పంపిస్తానని అడగడంతో హన్మండ్లు ఇచ్చాడు. అక్కడినుంచి ఫైల్ విచారణకోసం సిరిసిల్ల ఎక్సైజ్ సీఐకి చేరగా ఆయన విచారించి హన్మండ్లు అర్హుడే అని ఈ నెల 7న నివేదిక ఇచ్చారు. లెసైన్సులు జారీ చేసే అధికారం డెప్యూటీ కమిషనర్‌ది కావడంతో జగిత్యాల ఎక్సైజ్ కార్యాలయం నుంచి ఫైల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరింది. అనంతరం హన్మండ్లు మళ్లీ సీనియర్ అసిస్టెంట్ శంకర్‌కు ఫోన్ చేసి లెసైన్స్ త్వరగా ఇప్పించాలని కోరాడు. ఫైల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉందని, నివేదికలన్నీ పూర్తయ్యాయ ని, లెసైన్స్ ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమిలాడినా వినిపించుకోలేదు. దీంతో బాధితుడు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం హన్మండ్లు తాటికొండ శ్రీనివాస్‌తో కలిసి కరీంనగర్‌లోని డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి శంకర్‌కు సమాచారం ఇచ్చారు. అందరూ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కలుసుకున్నారు. హన్మండ్లు నుంచి శంకర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే శంకర్‌ను పట్టుకున్నారు. అక్కడినుంచి డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తరలించి విచారించారు. శంకర్‌పై కేసు నమోదు చేసి సోమవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. పలు కార్యాలయాల్లో కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని లంచాలు తీసుకుంటున్నారనే సమాచారం ఉందని, పక్కా సమాచారంతో దాడులు చేస్తామని, ఎంతటివారైనా వదిలిపెట్టబోమని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. గతంలోనూ... జగిత్యాల/ జగిత్యాల అర్బన్ : శంకర్‌నాయక్ సుమారు 25 ఏళ్ల క్రితం సైతం ఇలాగే ఏసీబీకి చిక్కాడు. శంకర్‌నాయక్ జూనియర్ అసిస్టెంట్‌గా సిరిసిల్ల ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో 1989 జూన్ 26న చందుర్తి మండలం లింగంపేటకు చెందిన లక్ష్మణ్‌రావు వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ కేసు నుంచి బయటపడి కొంతకాలంగా జగిత్యాల సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఉద్యోగుల జీతభత్యాలతోపాటు, జీపులు, వాహనాల వ్యయం చెల్లింపులు, ఇతర లిక్కర్ లావాదేవీల సంబంధించిన వ్యవహారాలను ఈయన పర్యవేక్షిస్తుంటారు. అంతర్గతంగా ఉన్న వివాదాలు సైతం ఇతడిని ఏసీబీకి పట్టించాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారన్న సమాచారంతో ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
మెరిసిన ‘రవి’కిరణం
కలెక్టర్ కావాలన్న.. తన చిన్ననాటి ఆశయం అతడ్ని ముందుకు నడిపించింది. అమ్మానాన్న, అన్న కల మార్గనిర్దేశం చేసింది. గురువుల శిక్షణ కొండంత బలాన్ని ఇచ్చింది. స్నేహితుల ప్రోత్సాహం గెలుపుపై మరింత ధీమా పెంచింది. దృఢమైన తన లక్ష్యం ముందు పేదరికం ఓడిపోయింది. ఉన్నత చదువులు చదివి తాను పుట్టినగడ్డకు ఏదో ఓ విధంగా సేవచేయాలనే సంకల్పమే విజయతీరాలకు చేర్చింది.. వెరసి పాలమూరు మట్టిగడ్డ గిరిజన బిడ్డ జెర్పుల రవి 28ఏళ్లలోనే సివిల్స్‌లో 1029వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అడ్డాకుల : మండలంలోని మారుమూల కాటవరం గిరిజనతండాకు చెందిన జెర్పుల శత్రునాయక్, లక్ష్మిల మూడో సంతానం రవి. అన్న శంకర్‌నాయక్, అక్క భాగ్యలక్ష్మి ఉన్నారు. తమకు ఉన్న ఐదేళ్ల పొలంలో పంటపండిస్తేనే వారి కుటుంబం గడిచేది. ఒకటో తరగతి తండాలోనే చదివాడు. ఆ తరువాత ఏడో తరగతి వరకు అడ్డాకులలోని శ్రీరాఘవేంద్ర విద్యానికేతన్, పదో తరగతి వరకు కొత్తకోట ప్యూపిల్స్ స్కూల్లో విద్యనభ్యసించాడు. ఒంగోలులోని శ్రీప్రతిభ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అప్పుడే ఐఐటీ రాయడంతో చెన్నైలో సీటు వచ్చింది. అక్కడే బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎన్టీపీసీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2010లో రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శ్రమించాడు..సాధించాడు! చెన్నై ఐఐటీలో ఎంటెక్ చేస్తున్న సమయంలో అక్కడే శంకర్ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అది వీకెండ్ కోచింగ్. శని, ఆదివారాల్లో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన తర్వాత 2013లో మూడు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి ఢిల్లీలో ఉన్న వజీరాం అండ్ రవి కోచింగ్ సెంటర్లో జనరల్ స్టడీస్‌పై శిక్షణ తీసుకుని సివిల్స్ పరీక్ష రాశాడు. మెయిన్స్ రావడంతో మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఇక్కడే ఇంటర్వ్యూ కోసం శిక్షణ తీసుకున్నాడు. నాలుగో యత్నంలో భాగంగా ఈ ఏడాది జాతీయస్థాయిలో 1029వ ర్యాంక్ సాధించాడు. ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం.. చిన్నప్పుడు నాన్న శుత్రునాయక్, అన్న శంకర్‌నాయక్‌లు మాకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ నన్ను చదివించారు. ముఖ్యంగా నాన్న ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పెద్ద చదువులన్నీ నగరాల్లోనే ఉండేవారు చదువుతారా..మనమెందుకు చదవ కూడదనే పట్టుదల పెరిగింది. ఒక ఉన్నతమైన లక్ష్యంతో చదివి చదివి సివిల్స్‌లో ర్యాంక్ సాధించాను. అయితే ఐఏఎస్ కావాలన్నది మాత్రం నా జీవితాశయం..తప్పకుండా ఐఏఎస్‌నవుతా. కచ్చితంగా ఎస్టీ కేటగిరిలో ఐపీఎస్ వస్తుందనే నమ్మకముంది. అది రాకపోతే ఐఆర్ఎఫ్ వస్తుంది. -జెర్పుల రవి, సివిల్స్ 1029వ ర్యాంకర్ చాలా సంతోషంగా ఉంది.. మా రవి కలెక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి మేమంతా కష్టపడి చదివిస్తున్నాం. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కలెక్టర్ కావాలని చదివాడు. అయితే వేరే ఉద్యోగం వస్తుందని చెప్పాడు. తర్వాత కూడా కలెక్టర్ కావాలని చదువుతానంటున్నాడు. మాకు ఐదెకరాల పొలం ఉంది. రవి ఉద్యోగం చేయడంతో వచ్చిన డబ్బుతోనే ఇళ్లు కట్టుకున్నాం. మావాడు పెద్ద ఉద్యోగానికి ఎంపికకావడం సంతోషంగా ఉంది. - రవి తల్లిదండ్రులు, అన్నయ్య, అక్క -
ప్రభుత్వ భవనాలకూ పన్ను కట్టాల్సిందే
యాచారం, న్యూస్‌లైన్ : గవర్నమెంట్ ఆఫీసు కదా అన్నీ ఫ్రీయే అని అధికారులు అనుకుంటే ఇక కుదరదు. అలాగే అందరికీ కనిపించేదే... అందరూ వచ్చిపోయేదే కదా... ఆఫీస్ అడ్రస్ చెప్పే పనేముంటుందని ఊరుకుంటే కుదరదు. మండలమైనా, గ్రామమైనా... ఎక్కడ ప్రభుత్వ కార్యాలయం ఉన్నా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక పన్నులు చెల్లించాల్సిందే. ప్రైవేటు సంస్థలు, భవనాల మాదిరిగా కార్యాలయాల వివరాలు స్థానికంగా నమోదు చేయాల్సిందే. ఈ నెల 22న జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో డీపీఓ పద్మజారాణి ప్రభుత్వ కార్యాలయాల వివరాలు స్థానిక రికార్డుల్లో నమోదు చేయాలని సూచించా రు. ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ పా ఠశాలలు, వసతిగృహాలను మినహా యించి మిగతా కార్యాలయాల నుంచి ఇంటిపన్ను, నీటిపన్ను కచ్చితంగా వసూలుచేయాలని ఆదేశించారు. రికార్డులు లేవు... యాచారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ కార్యాలయాల వివరాలు రికార్డులు లే వు. గతంలో పనిచేసిన పంచాయతీ అధికారులు ప్రభుత్వ భవనాలే కదా అని వాటివైపు చూడలేదు. మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, వ్యవసాయశాఖ, ఐకేపీ, హౌసింగ్, విద్యుత్ శాఖ తదితర కార్యాలయాలకు సం బంధించి యాచారం గ్రామ పంచాయతీలో రికార్డులు లేకపోగా, నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించడం లేదు. నోటీసుల జారీకి రంగం సిద్ధం ఈ నేపథ్యంలో డీపీఓ ఆదేశాల మేరకు యాచారం ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ చర్యలకు ఉపక్రమించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, పన్నుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లు, టెలిఫోన్ కేంద్రాలతో పాటు వ్యాపార సంస్థలు, నివాసగృహాలు తదితర రికార్డుల్లో లేని భవనాల వివరాలు సేకరించి కంప్యూటర్లలో పొందుపరుస్తున్నారు. పన్నులు చెల్లిస్తుంటే వాటి రసీదులు అందజేయాలని... లేకుంటే పన్నులు చెల్లించాలంటూ ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏటా రూ.80లక్షలకు పైగా ఆదాయం మండలంలోని 20 గ్రామాల్లో ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేస్తే ఏటా ఆయా పంచాయతీలకు రూ.80లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అనుమతుల్లేకుండా వ్యాపార సంస్థలు నిర్మాణాలు చేపట్టి పన్ను ఎగవేస్తుండగా, మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్నులు వసూలు చేసే వారు లేకుండాపోయారు. అన్ని గ్రామాల్లో ప్రైవేట్ భవనాలు, వ్యాపార సంస్థల నుంచి ప్రతి ఏటా ఆయా పన్నులు వసూలు చేస్తే రూ.60లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి మరో రూ.20లక్షలకు పైగా వసూలవుతుంది. -
సర్పంచ్‌లు నిధులు డ్రా చేసుకోవచ్చు
యాచారం, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘాల నిధులు పుష్కలంగా ఉన్నాయి, నిబంధనల ప్రకారం బిల్లులు పెట్టి సర్పం చ్‌లు నిధులు డ్రా చేసుకోవచ్చని ఈఓఆర్డీ శంకర్‌నాయక్ వెల్లడించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘సర్పంచ్‌లకు అప్పుల తిప్పలు’ అనే కథనానికి ఆయన స్పందించారు. కొద్ది రోజుల కింద ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం, రాష్ట్రం ఆర్థిక సంఘాలతో పాటు ఇతర పద్దుల కింద నిధులు మంజూరు చేసిందని తెలిపారు. వివిధ పద్దుల కింద మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ.40 లక్షల వరకు నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు. సర్పంచ్‌లుగా ఎన్నికైన నాటి నుంచి మండలంలో కొన్ని గ్రామాల్లో మినహా అధిక గ్రామాల్లో పైస నిధులు లేకపోవడం వాస్తవమేనన్నారు. సర్పంచ్‌లు తరుచూ కాలిపోతున్న బోరుమోటార్లు, స్టార్టర్ల, వీధిలైట్ల మరమ్మతుల కోసం అప్పులు చేసి మరమ్మతులు చేస్తున్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిధులు ఆయా పంచాయతీల్లో జమ కావడం వల్ల నిబంధనల ప్రకారం ఖర్చు చేసిన నిధులను డ్రా చేసుకోవచ్చని తెలియజేశారు. పలు గ్రామాల్లో మాయమైన బోరుమోటార్లు విషయమై కూడా విచారణ జరిపిస్తానని తెలిపారు. కథనానికి స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఇబ్రహీంపట్నం డివిజన్ డీఈ విజయలక్ష్మి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ... మండలంలో నీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైన నిధులు, బోరుమోటార్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. బోరుమోటార్ల మరమ్మతుల కోసం అప్పుల తిప్పలపై సాక్షిలో కథనం ప్రచురించడం పట్ల వివిధ గ్రామాల సర్పంచ్‌లు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడి హర్షం వ్యక్తం చేశారు.