
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. జిల్లాలోని మానుకోటలో రూ. 50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
అయితే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్‌తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ఎమ్మెల్యే చేయిని మంత్రి తీసి పడేశారు. కేటీఆర్ సీరియస్‌గా షాక్ ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.
ఇక పోడు పట్టాల పంపిణీ సభా వేదికపై కేటీఆర్‌కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. సభాముఖంగా జరిగిన అవమానంతో ఎమ్మెల్యే నరేందర్ వేదికపై చిన్నబోయి కూర్చున్నాడు. అయితే పట్టణంలో పర్యటించిన కేటీఆర్‌కు జర్నలిస్టులతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
చదవండి: ‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’
Comments
Please login to add a commentAdd a comment