సాక్షి, హైదరాబాద్ : షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య కు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంకారెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శంషాబాద్‌లోని ప్రియాంక నివాసం వద్ద స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందింతులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందిచారని మండిపడుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ‘దుండగులపై కేసులు వద్దు.. ఎన్‌కౌంటర్ చేయండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఈ క్రమంలో ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికులను పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం పోలీసులు చర్యను ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక నివాసం ఉంటున్న కాలనీలో ఎక్కువ మంది ఉత్తర భారతీయులు అయిన కూడా.. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక దారుణ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment