![Rahul Gandhi Response Over Priyanka Reddy Murder Case - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/29/Rahul_priyanka-reddy.jpg.webp?itok=FCBe16fB)
న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంక హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్య తనను తీవ్రంగా కలచివేసిందని రాహుల్ పేర్కొన్నారు. ఓ మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో బాధితురాలి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రియాంకా మృతి తమను కలచివేసిందని పేర్కొంటున్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రాకుండా చూడాలని కోరుతున్నారు.
చదవండి : ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు
Comments
Please login to add a commentAdd a comment