
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈనెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యవతి మాట్లాడారు. మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ ఏర్పా టు చేయాలని అనుకున్నామని అన్నారు. సభ లో గిరిజనులకు పోడు భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసేందుకు సమాయ త్తమయ్యామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పట్టాల పంపిణీలో జాప్య మవుతోందన్నారు. ఫిబ్రవరిలో మహబూబా బాద్‌లో భారీ బహిరంగ సభ పెట్టి పట్టాలు పంపిణీ చేసేందుకు వస్తానని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు. అప్పటివరకు గిరిజను లు వేచి ఉండాలని, అర్హులైన వారందరికి పట్టాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment