
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రి క్వార్టర్స్‌లో నిర్వహించిన హోమం సందర్భంగా పూర్ణాహుతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కాగా ఇటీవల హఠాత్తుగా కేసిఆర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
చదవండి: విద్యార్ధులకు శుభవార్త.. తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెంపు
Comments
Please login to add a commentAdd a comment