mrityunjaya
-
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
-
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రి క్వార్టర్స్‌లో నిర్వహించిన హోమం సందర్భంగా పూర్ణాహుతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ఇటీవల హఠాత్తుగా కేసిఆర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. చదవండి: విద్యార్ధులకు శుభవార్త.. తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెంపు -
ప్రజల తమవంతుగా ఇళ్లకే పరిమితం కావాలి
-
బెంగళూరులో మృత్యుంజయ కార్టూన్ ప్రదర్శన
-
'హోంమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నారు'
హైదరాబాద్: పొన్నాల లక్ష్మయ్య అనినీతిని బయటపెడతామంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయ విమర్శించారు. కలలను అమ్ముకుంటూ కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ను సింగపూర్, లండన్ చేస్తామంటూ సాధ్యంకాని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభం వల్లే 50 శాతం ఖరీఫ్ పంట నాశనమైందన్నారు. 200 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.