హైదరాబాద్: పొన్నాల లక్ష్మయ్య అనినీతిని బయటపెడతామంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయ విమర్శించారు. కలలను అమ్ముకుంటూ కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ను సింగపూర్, లండన్ చేస్తామంటూ సాధ్యంకాని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ సంక్షోభం వల్లే 50 శాతం ఖరీఫ్ పంట నాశనమైందన్నారు. 200 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'హోంమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నారు'
Published Tue, Sep 23 2014 3:55 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM