mrutyunjayam
-
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
-
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రి క్వార్టర్స్‌లో నిర్వహించిన హోమం సందర్భంగా పూర్ణాహుతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ఇటీవల హఠాత్తుగా కేసిఆర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. చదవండి: విద్యార్ధులకు శుభవార్త.. తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెంపు -
తోటపల్లి రిజర్వాయర్ భూములు రైతులకే ఇవ్వాలి
డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్ కోసం రైతులవద్ద సేకరించిన భూములను తిరిగి వారికే ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం డిమాండ్‌చేశారు. కరీంనగర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కుర్చీ వేసుకుని రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తానని ఎన్నికల ముందుచెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే తోటపల్లి ప్రాజెక్టును రద్దుచేసి రైతుల నోట్లో మట్టికొట్టారని ఆరోపించారు. రిజర్వాయర్‌కోసం సేకరించిన 1600ఎకరాల భూములను రైతులకే బేషరతుగా అప్పగించాలని డిమాండ్‌చేశారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు వెనుక భూములు హస్తగతం చేసుకోవాలనే కుట్ర బడాబాబులకు ఉందని, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు చెందిన భూములను అల్టిమేషన్ కంపెనీ(అమెరికాకు)లకు ధారదత్తం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. తోటపల్లి రిజర్వాయర్ భూములను ఇతర పనులకు వాడుకోవాలని చూస్తే ఊరుకోమని, రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. -
రాజీవ్‌తోనే సాంకేతిక విప్లవం
డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్ సిటీ : దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృత్యుంజయం మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించి రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత రాజీవ్‌దేనన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్‌లోని విగ్రహానికి పూలమాలలు వేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేవారు. ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వొంటెల రత్నాకర్, దిండిగాల మధు, నాగి శేఖర్, గౌతమ్ అర్జున్‌రెడ్డి, గందె మాధవి, మాదాసు శ్రీనివాస్, చెర్ల పద్మ, మూల జైపాల్, వీరారెడ్డి, మగ్దుం అలీ, పడాల శంకరయ్య, చంద్రశేఖర్, వేల్పుల వెంకటేశ్, చెన్నాడి అజిత్‌రావు, బాసెట్టి కిషన్, కల్వల రామచందర్, అక్బర్ అలీ, చిలుక ప్రవీణ్, పటేల్ సుధీర్‌రెడ్డి, ముద్దసాని క్రాంతి, అబ్దుల్ రహమాన్, ములుగు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.