-
డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం
కరీంనగర్ సిటీ : దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృత్యుంజయం మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించి రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత రాజీవ్‌దేనన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్‌లోని విగ్రహానికి పూలమాలలు వేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేవారు. ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వొంటెల రత్నాకర్, దిండిగాల మధు, నాగి శేఖర్, గౌతమ్ అర్జున్‌రెడ్డి, గందె మాధవి, మాదాసు శ్రీనివాస్, చెర్ల పద్మ, మూల జైపాల్, వీరారెడ్డి, మగ్దుం అలీ, పడాల శంకరయ్య, చంద్రశేఖర్, వేల్పుల వెంకటేశ్, చెన్నాడి అజిత్‌రావు, బాసెట్టి కిషన్, కల్వల రామచందర్, అక్బర్ అలీ, చిలుక ప్రవీణ్, పటేల్ సుధీర్‌రెడ్డి, ముద్దసాని క్రాంతి, అబ్దుల్ రహమాన్, ములుగు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.