సాక్షి, ములుగు: అటవీ జిల్లా ములుగులో కొద్ది రోజుల కురుస్తున్న వర్షాల వల్ల మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అక్కడి బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో ఆస్పత్రిలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవని మంత్రితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో మంత్రి సదరు మహిళకు కొడుకు వెంటనే మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడమే కాకుండా వ్యక్తగతం కూడా 10 వేల రూపాయలను అందించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment