Updates: మళ్లీ బుడమేరు భయం.. భారీగా చేరుతున్న వరద | AP Telangana Heavy Rains Flood Updates Sep 4 2024 Latest News Telugu | Sakshi
Sakshi News home page

Updates: మళ్లీ బుడమేరు భయం.. భారీగా చేరుతున్న వరద

Published Wed, Sep 4 2024 7:34 AM | Last Updated on Wed, Sep 4 2024 9:14 PM

AP Telangana Heavy Rains Flood Updates Sep 4 2024 Latest News Telugu

Telugu States Heavy Rains Latest News Updates

బుడమేరు ముంపు బాధితులకు చేదు అనుభవం

  • వరద ఉధృతి తగ్గడంతో ఇళ్లకు వెళ్తున్న వాళ్లను అడ్డుకున్న పోలీసులు
  • ప్రైవేట్‌ వాహనాలను ఎ​​‍క్కడికక్కడే అడ్డుకున్న వెనక్కి పంపిస్తున్న అధికారులు
  • ఎగువన వర్షాలతో బుడమేరుకు పెరుగుతున్న వరద
  • మరోసారి ముంచెత్తే అవకాశం

విశాఖలో భారీ వర్షం

  • విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షం
  • తీరం వెంట బలంగా వీస్తున్న గాలులు

భద్రాద్రి కొత్తగూడెం

  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
  • కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
  • 44 అడుగులుకి చేరిన గోదావరి వరద  
  • గోదావరి నది నుండి 9,74,666 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
  • 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు

వరద నష్టం వివరాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

  • భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రకటన 
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి
  • 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం 
  • 2.34లక్షల మంది రైతులు నష్టపోయారు
  • 60వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందాయి
  • వరదల వల్ల 22 సబ్‌స్టేషన్లు దెబ్బతినగా.. 3,973 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమమయ్యాయి 
  • 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి
  • వరదల వల్ల మొత్తం 6,44,536 మంది నష్టపోయారు
  • 193 రిలీఫ్‌ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు
  • వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి
  • 6 హెలికాప్టర్లు, 228 బోట్లు పనిచేస్తున్నాయి. 
  • 317 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు



నిజామాబాద్

  • శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
  • 41 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
  • ఇన్ ఫ్లో  3.5 లక్షల క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో 3.58 లక్షల క్యూసెక్కులు
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 90 టీఎంసీలు
  • ప్రస్తుతం 1089 అడుగులు, 75 టీఎంసీలు

పెద్దపల్లి 

  • అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం
  • ఇన్ ఫ్లో 3, 61, 885 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2, 44, 080 క్యూసెక్కులు
  • ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు
  • ప్రస్తుత నిల్వ 14. 0918 టీఎంసీ లు.
  • ప్రాజెక్ట్ కు సంబంధించిన 22 గేట్లు తెరచి సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం

  • కిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురు
  • పాల్వంచ మండలం దంతెలబోర పంచాయతీ పరిధిలో కిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురు
  • వీరిలో ముగ్గురు పశువుల కాపర్లు దంతెలబోర గ్రామానికి చెందినవారు
  • గంగాదేవిగుప్పకు చెందిన నలుగురు చేపల వేటకు వెళ్లి చిక్కుకున్నారు
  • రక్షించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు

సింగ్‌నగర్‌ ఖాళీ

  • సింగ్‌నగర్‌ను ఖాళీ చేస్తున్న జనాలు
  • ఇంకా వరదలోనే ఉన్న కాలనీ
  • ఫ్లై ఓవర్‌పై రద్దీ


మరోసారి భయపెడుతున్న బుడమేరు 

  • భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి 

  • ఎగువన కురిసిన భారీ వర్షాలతో నందివాడలో కూడా బుడమేరు ఉగ్రరూపం

  • వంతెనకు సమానంగా బుడమేరు ప్రవాహం 

  • గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరిక

  • ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు 

  • బుడమేరు పరివాహాక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న గట్లకు గండి పడకుండా ఇసుక బస్తాలు 

  • ఐదు దశాబ్దాల్లో ఈ తరహా బుడమేరులో ఇతంటి ఉధృతి చూడలేదని చెబుతున్న స్థానికులు 

  • ఇప్పటికే విజయవాడను ముంచెత్తిన బుడమేరు 

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

కృష్ణా

దొంగలుగా మారిన రెవెన్యూ సిబ్బంది!

  • అవనిగడ్డలో రెవెన్యూ ఉద్యోగుల చేతివాటం
  • గత అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దొంగలుగా మారిన రెవెన్యూ ఉద్యోగులు.
  • వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన నిత్యావసర వస్తువులను అర్ధరాత్రి  బైకులపై ఎత్తుకెళ్లిన రెవెన్యూ ఉద్యోగులు

తూర్పుగోదావరి

  • గోదావరిలో పెరుగుతున్న వరద
  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగుల వరద నీటిమట్టం నమోదు
  • ఆరు లక్షల 61 వేల క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల
  • 1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరా
  • వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు

కృష్ణా

  • తెన్నేరు లో బుడమేరు, వన్నేరు కాల్వలకు గండి.
  • ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.
  • ప్రధాన రహదారి లోకి చేరిన వరద నీరు.
  • జలదిగ్బంధంలో ఎస్సీ, బీసీ కాలనీలు.
  • నీట మునిగిన పంట పొలాలు.
  • వరద నీరు గ్రామంలోకి రాకుండా చెరువులోకి మళ్లించుకుంటున్న గ్రామస్తులు.
  • వరద నీటి నుంచి కాపాడాలని గ్రామస్తుల ఆవేదన.
  • పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.

కాలువలో ఆహారం!!

  • వరద బాధితులకు అందించాల్సిన భోజనాలు రోడ్డుపాలు
  • ఆహారం కోసం ఎదురు చూపులు చూసినా వరద బాధితులకు అందని భోజనాలు
  • వరద బాధితులకు అందవలసిన భోజనాలు ఏలూరు కాలువలో హైవే పక్కన పడేసిన వైనం

రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఎన్టీవో

  • ఏపీలో వరద బాధితులకు సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన ఎన్జీవో నేతలు
  • ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ. 120 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడి

ఏపీ వరద నష్టం.. కేంద్రం బృందం ఏర్పాటు

  • ఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందం ఏర్పాటు
  • అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ 
  • వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా
  • నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని వెల్లడి
  • ఏపీలో వరదల పరిస్థితిని మోదీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపిన కేంద్ర మంత్రి


చంద్రబాబు తప్పిదం వల్లే.. వైఎస్‌ జగన్‌ 

  • వరద బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయడం లేదు
  • తన ఇంట్లోకి నీళ్లు వచ్చాయి కాబ్టటే చంద్రబాబు కలెక్టరేట్‌కు చేరారు
  • వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా.. చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు
  • ఇప్పుడు వరద సహాయక చర్యల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు
  • మా హయాంలో వరదలప్పుడు..  అప్రమత్తంగా ఉన్నాం
  • రిలీఫ్‌ క్యాంపులు ముందుగానే ఏర్పాటు చేశాం.. ప్రజల్ని తరలించాం
  • వలంటీర్లు, సచివాలయం సిబ్బంది.. బాధితులను క్యాంపులకు తరలించేవాళ్లు
  • కానీ, ఇప్పుడు ఎక్కడా రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేయలేదు
  • బాధితుల్ని ఆదుకోవడం చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు
  • 32 మంది ‍ప్రాణాలు కోల్పోయారు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే
  • మృతులకు రూ.25 లక్షల పరిహారం, ప్రతీ ఇంటికి రూ.50 వేలు ఇవ్వాల్సిందే
  • తాను తప్పు చేసి అధికారులను వేలెత్తి చూపిస్తున్నారు
  • ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పును ఒప్పుకోవాలి
  • బుడమేరు గేట్లు ఎత్తింది ఎవరు?
  • చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే గేట్లు ఎత్తారు
  • ఆ నీరంతా విజయవాడను ముంచెత్తింది
  • ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది

సంబంధిత వార్త: చంద్రబాబు దగ్గరే తప్పు.. సీఎంగా అర్హుడేనా?: వైఎస్‌ జగన్‌

కాకినాడ 

  • అల్పపీడన ప్రభావంతో ఏపీలో మొదలైన భారీర్షాలు
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల దంచికొడుతున్న వాన
  • కోనసీమ జిల్లాలో 46.5 మి.మీ వర్షపాతం.
  • గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం
  • ధవళేశ్వరం బ్యారేజ్ నుండి దిగువకు 6 లక్షల 61 వేల క్యూసెక్ ల నీరు విడుదల.
  • రానున్న రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే గోదావరి వరద
  • కోనసీమ లంక గ్రామలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.
  • వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరు
  • కాకినాడ జిల్లాలో 94.6 వర్షపాతం నమోదు.
  • ఏలేరు ప్రాజెక్టు లో చేరుకున్న 20 tmc ల వరద నీరు.
  • దిగువకు 1500 క్యూసెక్ ల నీరు విడుదల.
  • పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలల్లో పలు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • తుఫాన్ హెచ్చరికల నేపసద్యంలో వేటను నిలిపివేయాలని మత్స్యశాఖ అధికారుల ఆదేశాలు.

 

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో జగన్‌ పర్యటన

  • విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన. 
  • ఓల్డ్‌ ఆర్‌ఆర్‌ (రాజరాజేశ్వరి) పేటలో బాధితులతో మాట్లాడుతున్న జగన్‌
  • సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వైస్సార్‌సీపీ అధినేత
  • ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితుల ఆవేదన
  • మొన్నీమధ్యే సింగ్‌నగర్‌లో పర్యటించిన జగన్‌
  • అక్కడి వరద పరిస్థితి.. బాధితుల అవస్థలు చూసి చలించి పోయిన జగన్‌
  • వరదలకు మానవ తప్పిదమే కారణమన్న జగన్‌

నిజామాబాద్ 

  • రెంజల్ మండల కందకుర్తి వద్ద గోదావరి నది ఉధృతి తో వంతెనను అనుకోని వరద ప్రవాహం
  • బ్రిడ్జి పై నుంచి రవాణా సదుపాయంద్దు 
  • తెలంగాణ,మహరాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

గోదావరికి పెరుగుతున్న వదర

  • 43 అడుగులకు చేరిన నీటి మట్టం
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 

 

కేంద్రం అసంతృప్తి.. తెలంగాణ సీఎస్‌కు లేఖ

  • తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ
  • తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపకపోవడం పై అసంతృప్తి
  • తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో  తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచన
  • 1345 కోట్ల రూపాయల ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన కేంద్రం
  • వరదల్లో సాయం చేసినందుకు ఇప్పటికే 12 ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు,  రెండు  హెలికాప్టర్లు పంపించినట్లు వెల్లడించిన కేంద్ర హోం శాఖ
  • ఎస్డిఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధులు విడుదలకు తక్షణమే వివరాలు పంపాలని ఆదేశం
  • జూన్ లో 208 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదన్న కేంద్రం
  • ఇదివరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫికెట్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరిన కేంద్రం
  • వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు  రోజువారీగా పంపాలని కోరిన కేంద్ర హోంశాఖ

విజయవాడ: 

  • విజయవాడకు మరో ముప్పు 
  • ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ 
  • విజయవడలో సుమారు 7 సెంమీ అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 
  • రానున్న 24 గంటల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి - విశాఖ వాతావరణ కేంద్రం

ఎన్టీఆర్ జిల్లా : 

  • బుడమేరులో కొనసాగుతున్న వరద ఉధృతి
  • కవులూరు - ఈలప్రోలు మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద
  • గడచిన 24 గంటల్లో జి.కొండూరు మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • ఎగువున కురిసిన వర్షాలతో కొంత పెరిగిన వరద
  • నందివాడలో ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు
  • ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • బలహీనంగా ఉన్న బుడమేరు పరీవాహక గట్లకు గండి పడకుండా ఇసుక బస్తాలు వేస్తున్న ప్రజలు

శ్రీశైలం :

  • నంద్యాల శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
  • జలాశయం గేట్లు అన్ని మూసివేసిన అధికారులు
  • ఇన్ ఫ్లో : 1,43,199 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో : 67,897 క్యూసెక్కులు
  • పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
  • ప్రస్తుతం  : 883.50  అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం : 208.7 టీఎంసీలు
  • కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

విజయవాడ :

  • విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద పడిగాపులు పడుతున్న మృతుల కుటుంబీకులు
  • వరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలింపు
  • వరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ నిర్లక్ష్యం
  • సీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు సహకరించని వైనం
  • ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలు
  • రెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే నిరీక్షిస్తున్న కుటుంబీకులు
  • పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు జాప్యం చేస్తున్న అధికారులు, పోలీసులు

విజయవాడ :

  • విజయవాడ ముంపులోనే వేలాది వాహనాలు
  • బుడమేరు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో ఇప్పటికీ పూర్తిగా వీడని ముంపు
  • ముంపులో నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వాహనాలు
  • నాలుగైదు రోజులుగా నీటిలోనే బైకులు, కారులు, ఆటోలు
  • ఒక్కొక్కటిగా బయటకు తీసి షెడ్లకు తరలిస్తున్న ఓనర్లు


ఎన్టీఆర్ జిల్లా:

  • తిరువూరులో మల్లమ్మ చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం
  • భారీ వర్షాలకు కోతకు గురైన చెరువుకట్ట
  • గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువుకు పోటెత్తుతున్న వరదనీరు
  • చెరువు పొంగితే కట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం
  • ఆందోళన చెందుతున్న ఆయకట్ట కింద ఉన్న రైతులు
  • ఇప్పటికే భారీ వరదలతో పొలాల్లో వేసిన ఇసుక మేట
  • అటుగా అక్కపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వరదలకు ధ్వంసం

ఖమ్మం జిల్లా :

  • మున్నేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో రెండవ రోజు ముమ్మరంగా కొనసాగుతున్న 525 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల సహాయక చర్యలు
  • వర్షాల వరద ఉద్ధృతి తగ్గడంతో చురుగ్గా సాగుతున్న పారిశుద్ధ్య పనులు  
  • ఇళ్లలోకి భారీగా చేరిన బురదను వాటర్ ట్యాంకర్లు ద్వారా తొలగింపు
  • రోడ్లపై విరిగి పడిన విద్యుత్ స్తంభాలు తొలగించి పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్న పోలీసులు
  • వరద బాధితులకు అండగా   ధంసాలపూరం,శ్రీనివాస్ నగర్, ప్రకాశ్ నగర్,రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, కవిరాజ్ నగర్, బొక్కలగడ్డ ముంపు ప్రాంతాలలో స్వయంగా పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 

ఎన్టీఆర్‌ జిల్లా :

  • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వర్షాలు
  • అర్ధరాత్రి నుంచి మైలవరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • మళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉంది
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రచారం   

విజయవాడ :

  • వరద బాధితులకు వాలంటీర్లే దిక్కు
  • అధికారులు, పోలీసులు వెళ్లలేని చోటుకు వెళ్తున్న వాలంటీర్లు
  • ట్రాక్టర్లలో ఆహారం, మంచినీరు తీసుకుని మారుమూల ప్రాంతాలకు వాలంటీర్లు
  • నాలుగు రోజుల తర్వాత బాధితులకు అందుతున్న కాస్తంత ఆహారం, నీరు
  • జగన్ నియమించిన వాలంటీర్లే చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కు
  • వాలంటీర్లను చూసి సంతోషిస్తున్న బాధితులు
  • ఈ పని నాలుగు రోజుల క్రితమే చేస్తే తమ ఆకలి తీరేదంటున్న బాధితులు

కోనసీమ జిల్లా :

  • కొత్తపేట నియోజకవర్గంవ్యాప్తంగా తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం
  • వర్షం కారణంగా పాఠశాలలకు కాలేజీలకు  సెలవు ప్రకటించిన అధికారులు
  •  ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేని భారీ వర్షం.
  • తహిసిల్దార్ వారి కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్లో చేరిన వర్షపునీరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

  • భారీ వర్షాలతో కొత్తగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
  • సెల్ఫీల కోసం వాగులు,వంకలు,నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దు
  • వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దు
  • వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.
  • వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది
  • కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలి
  • భద్రాచలం వద్ద గోదావరి నది  పెరుగుతున్నది కావున పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
  • జిల్లా అధికార యంత్రాంగం సూచించిన సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.
  • ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.
  • జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
  • ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

విజయవాడ : 

  • వరద ముంపు బాధితులకు పాల ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటిల్స్ అందించిన విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ
  • తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆదేశాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం
  • వరద బాధితులను ఆదుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత
  • వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైంది
  • ముందుచూపు చర్య లేకపోవడంతోటే విజయవాడకు విపత్తు కలిగింది
  • చంటి పిల్లలు మహిళలు వృద్ధులు అనేకమంది వరదలో ఇబ్బంది పడుతున్నారు
  • తన ఇంటిని కాపాడుకొనే క్రమంలోనే విజయవాడ ను ముంచేసిన చంద్రబాబు
  • వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి
  • ప్రజలందరూ కూడా తమవంతుగా సామాజిక బాధ్యత తీసుకునే తరుణమిది

నంద్యాల జిల్లా :

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
  • శ్రీశైలం జలాశయం 6 గేట్లు మూసివేత, 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు
  • ఇన్ ఫ్లో :1,43,199 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో : 1,81,235 క్యూసెక్కులు
  • పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు
  • ప్రస్తుతం  : 883.50  అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం : 208.7 టీఎంసీలు
  • కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి  

తూర్పుగోదావరి జిల్లా : 

  • తూర్పుగోదావరి,  కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం
  • రౌతుల ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరు
  • రాజమండ్రిలో లలితా నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు , ఆల్కాట్ గార్డెన్, ఆర్యాపురం తుమ్మలోవ ప్రాంతాలు జలమయం
  • కోనసీమలో పలు ప్రాంతాల్లో వరి చేలలో నిలిచిన వర్షపు నీరు
  • ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, శబరి నదుల్లో పెరుగుతున్న నీటిమట్టం

ఏలూరు జిల్లా : 

  • అల్పపీడనం  కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో పొంగుతున్న వాగులు
  • బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం దగ్గర  రహదారిపై ప్రవహిస్తున్న జల్లేరు వాగు
  • కొండ వాగులు వస్తున్న కారణంగా ప్రజలు  వాగులు దాటవద్దని ప్రమాదకరమని  తెలిపిన అధికారులు
  • జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద డైవర్షన్
  • రహదారిపై  జల్లేరు వాగు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు నిలిచిపోయిన రాక పోకలు.

వైజాగ్‌ :  

  • ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు 
  • బంగాళాఖాతంలో అల్పపీడనం 
  • క్రమంగా బలపడే అవకాశం 
  • తుఫానుగా మారే ఛాన్స్ 
  • వెదర్ బులిటెన్‌ పూర్తి వివరాలు వెల్లడించనున్న వాతావరణ శాఖ

అల్లూరి సీతారామరాజు జిల్లా: 

  • చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా అడపాదడపా వర్షాలు
  • ఎగువ ప్రాంతంలో వర్షాలకు కూనవరం శబరి-గోదావరి నదుల సంగమం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :

  • పి గన్నవరం నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షం
  • ఇబ్బంది పడుతున్న వాహనదారులు
  • భారీ వర్షం కారణంగా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలలు ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్

తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం :

  • రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి
  • తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి 
  • పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం
  • తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి
  • మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది
  • రెండు రాష్ట్రాల లో  ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు  కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను
  • ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 

కామారెడ్డి జిల్లా :

  • నిజాం సాగర్ ప్రాజెక్టులోకి  కొనసాగుతున్న వరద
  • ఇన్ ఫ్లో 39.157 క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17 టీఎంసీలు
  • ప్రస్తుత నీటిమట్టం 1403అడుగులు, 14 టీఎంసీలు

నిజామాబాద్ జిల్లా :

  • శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
  • 41 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
  • ఇన్ ఫ్లో  2.81 లక్షల క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో 1.75 లక్షల క్యూసెక్కులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 90 టీఎంసీలు
  • ప్రస్తుతం 1089 అడుగులు, 74 టీఎంసీలు

విజయవాడ : 

  • గోదావరికి స్వల్పంగా పెరుగుతున్న వరద
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
  • భద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటి మట్టం
  • ధవళేశ్వరం వద్ద ప్రస్తుత  ఇన్ ఫ్లో 3,05,043, ఔట్ ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కులు
  • ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ
  • గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  •  రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

  • కాలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉధృతంగా గోదావరి
  • గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 11.710  మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులు
  • మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి కొనసాగుతున్న వరద
  • మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 8,85,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల 
  • ఇన్ ప్లో ఔట్ ఫ్లో 8,85,620 క్యూసెక్కులు
  • లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : 

  • భద్రాచలం వద్ధ కొనసాగుతున్న గోదావరి ఉధృతి
  • మోదటి ప్రమాద హెచ్చరికకి చేరువలో  గోదావరి ప్రవాహం
  • ఈరోజు ఉదయానికి 42.2 అడుగులకి చేరుకున్న గోదావరి నీటి మట్టం
  • 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు 
  • ఇప్పటికే నియోజకవర్గంలోని ముంపు గ్రామలతో పాటు , భద్రాచలం పట్టణం ప్రజల్ని అప్రమత్త చేసిన అధికారులు
  • ఎటువంటి ఇబ్బంది తలేత్తకుండా ముందస్తు సహాయక  చర్యలకి  ఆదేశించిన జిల్లా కలెక్టర్

విజయవాడ :

వరదల్లో బయటపడ్డ మృతదేహాలు

  • మల్లిపాముల వర్ధన్(18)
  • మాత సన్యాసి అప్పుడు(85)
  • గుంజ రమణ(48)
  • వజ్రాల కోటేశ్వరరావు(41)
  • కె దూరగారవు(16)
  • కె వెంకట రమణారెడ్డి(50)
  • నాగ దుర్గారావు(33)
  • పలిశెట్టి చంద్రశేఖర్(32)
  • కొడాలి యశ్వంత్(20)
  • మరో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

విజయవాడ :

  • వరద బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ
  • లక్ష పాల ప్యాకెట్లు ,రెండు లక్షల వాటర్ బాటిళ్లు సిద్ధం
  • వరద ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు ట్రాక్టర్లు,ప్రొక్లెయిన్ల ద్వారా పంపించిన మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణు

విజయవాడ :

  • విజయవాడలో వరద విషాదం
  • నిన్న 12 మృత దేహాలు వరదల్లో లభ్యం
  • 32 కి చేరిన వరద మరణాలు
  • ఇంకా ముంపులోనే పలు కాలనీలు
  • వరద తగ్గుతున్న చోట ఎవరికి వారే బయటకు వస్తున్న బాధితులు
  • ఇళ్ళు, వాహనాలు వదిలేసి బిక్కు బిక్కుమంటు వచ్చేస్తున్న వరద బాధితులు

 

విజవాడ : 

ఇంకా వరద ముప్పులోనే విజయవాడ

ఎన్టీఆర్ జిల్లా స్కూళ్లకు సెలవు 

  • జిల్లాలో కురుస్తున్న  వర్షాలు, వరద ఉధృతి 
  • బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్  పాఠశాలలకు సెలవు
  • జిల్లా కలెక్టర్ జి.సృజన ప్రకటన

పెద్దపల్లి జిల్లా:

  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం
  • ఇన్ ఫ్లో 4, 72, 428 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో 4, 59, 912 క్యూసెక్కులు
  • ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు
  • ప్రస్తుత నిల్వ 14. 5606 టీఎంసీ లు.
  • ప్రాజెక్ట్ కు సంబంధించిన 32 గేట్లు తెరచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
  • నది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
  • పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలను కలుపుతూ శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న రహదారిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన అధికారులు

పెద్దపల్లి జిల్లా :

  • రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలు
  • రామగుండం రీజియన్ లోని నాలుగు ఓసీపీలలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, రవాణా
  • నేటికీ సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
  • ప్రాజెక్టు క్వారీ పని స్థలాలలో భారీగా నిలిచిన వరద నీరు, బురదతో కదలని భారీ యంత్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement