
సాక్షి, వరంగల్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మేడారంలోని జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ములుగు జిల్లాలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. కాగా లో లెవల్ కాజేవే పై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏటూరు నాగారంతో పాటు మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపు నీటితో వాగులు వంకలు పోంగిపోర్లుతున్నాయి .