సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. అందులో పురుషుల సంఖ్య 1,76,11,633 కాగా మహిళలు 1,73,92,041మంది ఉన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం చూస్తే...మొత్తం ఎస్సీల జనాభా 54,08,800 కాగా వారిలో మహిళలు 27,15,673, పురుషులు 26,93,127 మంది ఉన్నారు. ఇక ఎస్టీల జనాభా విషయానికొస్తే... మొత్తం 31,77,940 ఉండగా, అందులో పురుషులు 16,07,656, మహిళలు 15,70,284 మంది ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఎస్టీల జనాభా సంఖ్య 3,92,034, మహబూబ్‌బాద్ జిల్లాలో 2,92,778, ఆదిలాబాద్ జిల్లాలో 2,24,622, నల్లగొండ జిల్లాలో 2,09,252, ఖమ్మం జిల్లాలో 1,99,342.
► ఎస్సీల విషయానికొస్తే...రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అంటే 3,34,337, ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 2,92,951, ఖమ్మం జిల్లాలో 2,79,319, సంగారెడ్డి జిల్లాలో 2,77,429. హైదరాబాద్ జిల్లాలో 2,47,927 మంది ఉన్నారు.
►బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అడిగిన ప్రశ్నకు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయా అంశాలు పొందుపరిచారు. గతంలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలను షెడ్యూల్ ప్రాంతాల జిల్లాలుగా పరిగణించగా, ప్రస్తుతం అవే షెడ్యూల్ ప్రాంతం కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, నాగర్‌కర్నూల్ అనే 9 జిల్లాల్లో ఉన్నట్టు తెలియజేశారు.
►ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకతో సహా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలు=1,286
►వందశాతం ఎస్సీ గ్రామపంచాయతీలు (తండాలు/గూడెంలు) =1,177 ప్లెయిన్, ఎస్టీ రిజర్వ్ గ్రామపంచాయతీలు =687
►2018–19 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్ ప్రాంత జీపీలు, వంద శాతంఎస్టీ జీపీలు, షెడ్యూలేతర ప్రాంతాల్లో ఎస్టీ జీపీలకు విడుదల చేసిన గ్రాంట్లు సంక్షిప్తంగా కలిపి మొత్తం...రూ.2,062.75 కోట్లు గ్రాంట్ల రూపంలో విడుదల చేసినట్టు తెలియజేశారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి: ఈటల
Comments
Please login to add a commentAdd a comment