Telangana population
-
Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. అందులో పురుషుల సంఖ్య 1,76,11,633 కాగా మహిళలు 1,73,92,041మంది ఉన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం చూస్తే...మొత్తం ఎస్సీల జనాభా 54,08,800 కాగా వారిలో మహిళలు 27,15,673, పురుషులు 26,93,127 మంది ఉన్నారు. ఇక ఎస్టీల జనాభా విషయానికొస్తే... మొత్తం 31,77,940 ఉండగా, అందులో పురుషులు 16,07,656, మహిళలు 15,70,284 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఎస్టీల జనాభా సంఖ్య 3,92,034, మహబూబ్బాద్ జిల్లాలో 2,92,778, ఆదిలాబాద్ జిల్లాలో 2,24,622, నల్లగొండ జిల్లాలో 2,09,252, ఖమ్మం జిల్లాలో 1,99,342. ► ఎస్సీల విషయానికొస్తే...రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అంటే 3,34,337, ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 2,92,951, ఖమ్మం జిల్లాలో 2,79,319, సంగారెడ్డి జిల్లాలో 2,77,429. హైదరాబాద్ జిల్లాలో 2,47,927 మంది ఉన్నారు. ►బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయా అంశాలు పొందుపరిచారు. గతంలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలను షెడ్యూల్ ప్రాంతాల జిల్లాలుగా పరిగణించగా, ప్రస్తుతం అవే షెడ్యూల్ ప్రాంతం కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, నాగర్కర్నూల్ అనే 9 జిల్లాల్లో ఉన్నట్టు తెలియజేశారు. ►ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకతో సహా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలు=1,286 ►వందశాతం ఎస్సీ గ్రామపంచాయతీలు (తండాలు/గూడెంలు) =1,177 ప్లెయిన్, ఎస్టీ రిజర్వ్ గ్రామపంచాయతీలు =687 ►2018–19 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్ ప్రాంత జీపీలు, వంద శాతంఎస్టీ జీపీలు, షెడ్యూలేతర ప్రాంతాల్లో ఎస్టీ జీపీలకు విడుదల చేసిన గ్రాంట్లు సంక్షిప్తంగా కలిపి మొత్తం...రూ.2,062.75 కోట్లు గ్రాంట్ల రూపంలో విడుదల చేసినట్టు తెలియజేశారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి: ఈటల -
కడుపుకోతల్లో కరీంనగర్ టాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60.7శాతం ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతున్నాయని తెలంగాణ జనాభా, ఆరోగ్య నివేదిక వెల్లడించింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రచురించిన ఈ రిపోర్టును గణాంకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం విడుదల చేశారు. నివేదిక ప్రకారం... సిజేరియన్ ప్రసవాలు కుమ్రం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 27.2% జరుగుతున్నాయి. అత్యంత అధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4% జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రు ల్లో 81.5% ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతుండగా, అందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా లో 92.8% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మొత్తం 44.5% మాత్రమే సిజేరియన్లుండగా, అత్యధికంగా జనగాంజిల్లాలో 73% సిజేరియన్ ప్రసవాలు అవుతున్నాయి. నివేదికలోని ముఖ్యాంశాలు... ►15 ఏళ్ల లోపు జనాభా అధికంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అక్కడి జనాభాలో 27.8% మంది ఆ వయస్సులోపు వారే. ఆ వయస్సువారి తెలంగాణ సరాసరి జనాభా 22.5%. ►రాష్ట్రంలో వెయ్యి మంది పురుషులకు 1,049 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 1,219 మంది ఉండగా, హైదరాబాద్లో అత్యంత తక్కువగా 959 మంది ఉన్నారు. ►తెలంగాణలో 95.8 శాతం మంది ఇళ్లల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 99.1శాతం మంది వాడుతున్నారు. ►రాష్ట్రంలో 60.8శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 72శాతం మందికి ఉంది. ►రాష్ట్రంలో 15–19ఏళ్ల వయస్సులో తల్లులైనవారు, గర్భిణీలుగా ఉన్నవారు 5.8% ఉండగా, వీరిలో అత్యంత తక్కువగా సిద్దిపేట జిల్లాలో ఒక శాతం ఉన్నారు. అత్యంత ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 15.9శాతం ఉన్నారు. ►రాష్ట్రంలోఆసుపత్రుల్లో ప్రసవాలు సరాసరి 97% ఉండగా, వరంగల్ రూరల్ జిల్లాలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ►రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 49.7% జరుగుతుండగా, ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 66.8శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలో 15ఏళ్లు పైబడినవారిలో తీవ్రమైన షుగర్ వ్యాధితో మందులు వాడుతున్న పురు షులు 18.1శాతం ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 26.8 శాతం మంది ఉన్నారు. కాగా, మహిళల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో 14.7శాతం ఉండగా, హైదరాబాద్లో 21.2శాతం ఉన్నారు. -
తెలంగాణ జనాభా 3.63 కోట్లు
* జనాభా రంగారెడ్డిలో అత్యధికం, నిజామాబాద్లో అత్యల్పం * 51.08% మంది బీసీలు, మైనార్టీలు 14.46 శాతం * దాదాపు 42 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్డే లేదు.. * సమగ్ర కుటుంబ సర్వేతో వెలుగులోకి ఆసక్తికర విషయాలు * కోటికిపైగా కుటుంబాల సమగ్ర వివరాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత సుపరిపాలన లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ అనేకాంశాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ర్ట జనాభా గణాంకాలతోపాటు ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,63,03,012గా తేలింది. రాష్ర్టంలోని పది జిల్లాల్లో మొత్తం 1,01 కోట్ల కుటుంబాల నుంచి సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 91.38 లక్షల కుటుంబాలు డిక్లరేషన్ సమర్పించాయి.