అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | CCTV Footage, Woman Dies In Accident At Chaderghat | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Published Sat, Nov 2 2019 4:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చాదర్‌ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కావ్య అనే యువతి మృతి చెందింది. వివరాలు.. చాదర్‌ఘాట్‌లో ఓ వ్యక్తి యువతిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నాడు. రోడ్డుపై ఏర్పడ్డ గుంత కారణంగా వారి టూ వీలర్‌ ఒక్కసారిగా జారిపడటంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వారి మీద నుంచి వేగంగా దూసుకుని పోయింది. దీంతో కావ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి పరిస్థితి విషయంగా ఉంది. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డు సరిగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, రోడ్డుపై ఏర్పడ్డ గుంతల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య పరీక్ష రాయడానికి వెళ్తున్న సమయంలో ఈ ‍ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు బెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement