సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: అడ్వకేట్ సొసైటీ స్పోర్ట్స్ మీట్ శనివారం చాదర్ ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్‌ను జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ప్రేమ్‌రాజ్, సొసైటీ అధ్యక్షులు పాపిరెడ్డి ప్రారంభించారు. న్యాయవాదులకు మొదటిరోజు బాస్కెట్‌బాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్, చెస్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో సొసైటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 6 గంటల వరకు కబడ్డీ, రన్నింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ శ్రీనాథ్, డెరైక్టర్లు రాజీవ్‌రెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, బాలకృష్ణ, కార్యదర్శి రమేశ్ గుప్తా, ప్రతినిధులు కొండూరు వినోద్, ప్రవీణ్, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడ్వకేట్ సొసైటీ క్రీడలు షురూ
Published Sun, Apr 6 2014 12:46 AM | Last Updated on Wed, May 29 2019 3:25 PM
Advertisement
Advertisement