premraj
-
సెన్సార్ బోర్డ్ తీరు బాధాకరం
‘‘యువతరాన్ని మేల్కొలిపేలా.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ క్లీన్ ఎంటర్టైనర్గా ‘శరణం గచ్ఛామి‘ సినిమా తీశాం. అయితే, సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వారి తీరు ఆవేదనను కలిగిస్తోంది’’ అన్నారు చిత్ర దర్శక– నిర్మాతలు ప్రేమ్‌రాజ్, బొమ్మకు మురళి. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అశ్లీలం, హింసను ప్రేరేపిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న సినిమాలకు ‘క్లీన్ సర్టిఫికెట్స్’ జారీ చేసే సెన్సార్ బోర్డ్ సభ్యులు, క్లీన్‌గా తెరకెక్కిన మా చిత్రానికి ఎందుకు ఇవ్వడం లేదో తెలియడంలేదు. సరైన కారణాలు చూపకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం బాధాకరం. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణి, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళతాం’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. -
హీరో మహేష్‌బాబును కలిపిస్తామని టోకరా
బంజారాహిల్స్ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు బంజారాహిల్స్: సినీ హీరో మహేష్‌బాబును కలిపిస్తానని నమ్మించి మోసం చేసిన అపరిచితుడిపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన ప్రేమ్‌రాజ్ రైతు. మూడు నెలల క్రితం ఆయనకు గుండెకు రంధ్రంతో కూతురు పుట్టింది. చికిత్స నిమిత్తం నగరంలోని స్టార్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సినిమా కథలు, పాటులు రాసే అలవాటున్న ప్రేమ్‌రాజ్ తాను నగరంలోనే ఉండటంతో హీరో మహేష్‌బాబుకు తన పాటలు, కథలు వినిపిద్దామనుకున్నాడు. ఆయనను కలవడానికి ఉన్న మార్గాలపై గూగుల్ సెర్చ్ చేయగా... అందులో మహేశ్‌ను కలిపిస్తామని ఒక ఫోన్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్‌కు ఫోన్‌కు చేయగా.. రూ. 10 వేలు ఖర్చు అవుతుందని, అడ్వాన్స్ కింద రూ. 5 వేలు తన ఖాతాలో వేయాలని సదరు వ్యక్తి ప్రేమ్‌రాజ్‌కు చెప్పాడు. మహేశ్‌కు కథ వినిపించే అవకాశమే కల్పించడమే కాకుండా ఆయనతో నీ కూతురి వైద్యానికి ఖర్చులు కూడా ఇప్పిస్తానని నమ్మబలి కాడు. దీంతో ప్రేమ్‌రాజ్ గతనెల 30న ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ. 5 వేలు జమ చేశాడు. తీరా ఈనెల 1న ఆ వ్వక్తికి మళ్లీ ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మూడు రోజులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఐపీసీ 120 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అవేక్’ చిన్నారులకు విముక్తి
ప్రేమ్ రాజ్ పై కేసు నమోదు హైదరాబాద్: నగర పరిధిలోని మౌలాలిలో ‘అవేక్ ఓ వరల్డ్’ సంస్థలో ఉంటున్న చిన్నారులకు అక్కడి బాధలనుంచి విముక్తి లభించింది. దీని నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ తన వద్ద ఉన్న చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడి, వారిని ఇబ్బందులకు గురిచేసిన సంగతి వెలుగు చూడడంతో చైల్డ్వెల్ఫేర్ కమిటీ బాధితులకు అతని చెరనుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ‘అవేక్ ఓ వరల్డ్’ పై రెండు రోజులపాటు ప్రాథమిక విచారణ జరిపిన తరువాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరో మారు విచారణ చేపట్టింది. ఆశ్రమంలో ఉన్న పిల్లల అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసిన తరువాత పూర్తి ఆధారాలతో సంస్థ నిర్వాహకుడిపై కుషాయిగూడా పోలీస్ స్టేషన్ లో ‘ఫోక్సో’ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా గత ఆరేళ్లుగా ప్రేమ్‌రాజ్ నడుపుతున్న ఈ సంస్థ చట్టవిరుద్ధమైందనీ, దీనిలో పిల్లలకు రక్షణ లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ పద్మావతి, సభ్యురాలు విజయాదేవి బృందం అభిప్రాయపడింది. తక్షణమే ఇక్కడి బాలికలను మేడిపల్లి లోని చైల్డ్ గెడైన్స్ సెంటర్‌కూ, మగపిల్లలను సైదాబాద్ లోని ప్రభుత్వ హోంకు తరలించారు. ‘అవేక్ ఓ వరల్’్డలో మొత్తం 35 మంది చిన్నారులు ఉండాల్సి ఉండగా ఏడుగురు మగపిల్లలు, 10 మంది బాలికలు కలిపి 17 మంది పిల్లలే ఉండడం గమనార్హం. మిగిలిన వారు ఏమయ్యారన్నది ప్రేమ్ రాజ్ స్పష్టం చేయాల్సి ఉంది. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నింబోలిఅడ్డాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రేమ్ రాజ్ హాజరు కావాల్సి ఉంది. ‘అవేక్’లో ఉన్న 7, 8 వ తరగతుల పిల్లల పరీక్షలు మధ్యలో ఉన్నందున వారి చదువులకు ఇబ్బందికలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కమిటీ చైర్పర్సన్ పద్మావతి,సభ్యురాలు విజయాదేవి పేర్కొన్నారు. పూర్తి విచారణ తరువాత చిన్నారులకు ప్రభుత్వం శాశ్వత భద్రత కల్పిస్తుందని ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ‘అవేక్’ నిర్వాకాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా ఖండించారు. తక్షణమే నిందితుడిపై పూర్తి విచారణ జరిపించి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
జీహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి
-
'జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి'
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి నాలాలో పడి గర్భిణి సత్యవాణి మృతి చెందడానికి జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద నాలాను ఎందుకు మూసివేయలేదు? గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు? ఈ ఘటనలో జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే తన భార్య సత్యవాణి మృతికి కారణమని ఆమె భర్త ప్రేమ్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం అలియాబాద్‌కు వచ్చారు. భాస్కర్, లక్ష్మి దంపతుల కూతురు సత్యవాణికి ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి సత్యవాణి తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వెళ్లేందుకు ఉప్పల్ బస్టాండ్ వద్దకు వచ్చింది. అయితే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు తన భార్య నాలాలో పడితే జీహెచ్ఎంసి రెస్క్యూ టీం ఎనిమిదిన్నర గంటల తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారని సత్యవాణి భర్త అవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భార్య మృతికి జీహెచ్ఎంసి అధికారులదే పూర్తి బాధ్యత అని అంటున్నారు. సత్యవాణి మృతి చెంది 15 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు జిహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులు స్పందించలేదన్నారు. జిహెచ్ఎంసి అధికారులపై స్థానిక గోపాలపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రేమ్‌రాజ్ చెప్పారు. సత్యవాణి మృతికి కారణమైన ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాను సంవత్సరం క్రితం నిర్మించారు. నాలా నిర్మిస్తున్న సమయంలో అది కూలిపోవడంతో స్ధానికులు అప్పుడే జీహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు లంచాలకు అలవాటుపడి ప్రజల రక్షణను గాలికి వదిలేస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పందించి ఓపెన్ నాలాలు మూసివేయడంతో పాటు గర్భిణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన సత్యవాణి కుటుంబానికి జీహెచ్ఎంసి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ** -
నాలాలో కొట్టుకుపోయిన మహిళ
శామీర్‌పేట్ : బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు. భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు. వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘మనం’ లోగో రూపకర్త ప్రేమ్‌రాజ్
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన మనం సినిమా లోగోను ఆత్మకూరు మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గిన్నారపు ప్రేమ్‌రాజ్ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్రావు చివరి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావు, నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా, సమంత, శ్రేయ హీరోయిన్లుగా చేశారు. ప్రేమ్‌రాజ్ కొంత కాలంగా సినిమా లోగోలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటింగ్) చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కాశిబుగ్గకు చెందిన అనిల్ ఈ సినిమాకు పోస్టర్ డిజైనర్‌గా చేయడం వల్ల లోగోను రూపొందించి అవకాశం తనకు దక్కిందన్నారు. ఇంతపెద్ద సిని మాకు లోగో తయారు చేయడం అదృష్టంగా భావి స్తున్నానని తెలిపారు. -
అడ్వకేట్ సొసైటీ క్రీడలు షురూ
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: అడ్వకేట్ సొసైటీ స్పోర్ట్స్ మీట్ శనివారం చాదర్ ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్‌ను జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ప్రేమ్‌రాజ్, సొసైటీ అధ్యక్షులు పాపిరెడ్డి ప్రారంభించారు. న్యాయవాదులకు మొదటిరోజు బాస్కెట్‌బాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్, చెస్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో సొసైటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 6 గంటల వరకు కబడ్డీ, రన్నింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ శ్రీనాథ్, డెరైక్టర్లు రాజీవ్‌రెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, బాలకృష్ణ, కార్యదర్శి రమేశ్ గుప్తా, ప్రతినిధులు కొండూరు వినోద్, ప్రవీణ్, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.