
‘మనం’ లోగో రూపకర్త ప్రేమ్‌రాజ్
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన మనం సినిమా లోగోను ఆత్మకూరు మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గిన్నారపు ప్రేమ్‌రాజ్ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్‌రావు చివరి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్‌రావు, నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా, సమంత, శ్రేయ హీరోయిన్‌లుగా చేశారు. ప్రేమ్‌రాజ్ కొంత కాలంగా సినిమా లోగోలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు.
ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటింగ్) చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కాశిబుగ్గకు చెందిన అనిల్ ఈ సినిమాకు పోస్టర్ డిజైనర్‌గా చేయడం వల్ల లోగోను రూపొందించి అవకాశం తనకు దక్కిందన్నారు. ఇంతపెద్ద సిని మాకు లోగో తయారు చేయడం అదృష్టంగా భావి స్తున్నానని తెలిపారు.