
పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
రైల్వేకోడూరు అర్బన్: విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో బీజేపీ, టీడీపీ ప్రజల్ని నయవంచన చేస్తున్నాయని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ సాధనలో భాగంగా బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కడపకు ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని హామీ ఇచ్చి నేడు కుదరదని చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి తగదన్నారు. ఉక్కు పరిశ్రమ సాధించలేని టీడీపీకి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఉక్కు పరిశ్రమ వల్ల లక్షలాది మంది యువకులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, నవీన్, క్రాంతి, పెంచలయ్య, తేజ పాల్గొన్నారు.