బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె!
నిజామాబాద్‌నాగారం : భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం అధికారికరంగా ప్రకటించాల్సి ఉన్నా మూహుర్తం బాగాలేదని ఆపివేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్‌లు సైతం పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అధికారికంగా జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. ఈనెల 3న లేదా 4న పార్టీ కార్యకర్తల సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.
మొదటి నుంచి పల్లె గంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ సీనీయర్ నాయకులు నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అంతర్గత కలహాలు వీడిన కమలనాథులు, జిల్లా సారథి ఏకగ్రీవంపై కలిసి కట్టుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జిల్లా సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, లోకభూపతిరెడ్డి తదితరులు కలిసి కట్టుగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికను ఏకగ్రీవం చేశారు. జిల్లా ఇన్‌చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్‌లు పల్లెగంగారెడ్డి ఎన్నికను విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించి, నియమక పత్రాన్ని అందజేయనున్నారు.