Palle gangareddy
-
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె!
నిజామాబాద్‌నాగారం : భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం అధికారికరంగా ప్రకటించాల్సి ఉన్నా మూహుర్తం బాగాలేదని ఆపివేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్లు సైతం పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అధికారికంగా జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. ఈనెల 3న లేదా 4న పార్టీ కార్యకర్తల సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. మొదటి నుంచి పల్లె గంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ సీనీయర్ నాయకులు నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అంతర్గత కలహాలు వీడిన కమలనాథులు, జిల్లా సారథి ఏకగ్రీవంపై కలిసి కట్టుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జిల్లా సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, లోకభూపతిరెడ్డి తదితరులు కలిసి కట్టుగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికను ఏకగ్రీవం చేశారు. జిల్లా ఇన్చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్లు పల్లెగంగారెడ్డి ఎన్నికను విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించి, నియమక పత్రాన్ని అందజేయనున్నారు. -
పల్లెకే మళ్లీ పగ్గాలు
* బీజేపీ జిల్లా సారథి గంగారెడ్డి * ఆనందరెడ్డికి అధిష్టానం బుజ్జగింపు * పోటీచేసే యోచన నుంచి విరమణ * పార్టీ కార్యాలయంలో నేడు ప్రకటన * రాష్ట్ర కమిటీలో ఆనందరెడ్డికి స్థానం * సీనియర్ల చొరవతో ఎన్నిక ఏకగ్రీవం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ జిల్లా పగ్గాలు మళ్లీ పల్లె గంగారెడ్డికే దక్కనున్నాయి. ఆయనను రెండోసారి జిల్లా అధ్యక్షునిగా కొనసాగించేందుకు పార్టీ నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. శనివారం పార్టీ సీనియర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్యులతో అభిప్రాయ సేకరణ జరిపారు. జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపిన కేశ్‌పల్లి ఆనందరెడ్డితో మాట్లాడిన మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఆనంద్ రెడ్డి గట్టి నిర్ణయంతో ఉండగా, రెండోసారి జిల్లా అధ్యక్షునిగా కొనసాగేందుకు పల్లె గంగారెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు, పార్టీ సీనియర్లు ఆనందరెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడటం తో పునరాలోచన చేసిన ఆయన పోటీ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం జరిపిన అభిప్రాయ సేకరణ, సీనియర్లతో సంప్రదింపులు ఫలించడంతో మళ్లీ గంగారెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆనందరెడ్డి, గంగారెడ్డిల మధ్యన సత్సంబంధాలు, ఆనందరెడ్డి పెద్ద మనసు చేసుకుని విరమించుకోవడం వల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం కానుందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గంగారెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే కాగా.. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పల్లె గంగారెడ్డి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆనందరెడ్డికి రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం కల్పించేందుకు అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతర్గత కలహాలను వీడిన కమలనాథులు, జిల్లా సారథి ఏకగ్రీవంపై కలిసి కట్టు గా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ , లోక భూపతిరెడ్డి తదితరులు రెండు రోజులుగా పార్టీ నేతలు, క్యాడర్‌తో సంప్రదింపులు జరి పా రు. కేశపల్లి ఆనందరెడ్డి, గంగారెడ్డి ఎన్నికపై సానుకూలత వ్యక్తం చేయ డం ‘ఏకగ్రీవం’ మరింత సుగమం అయినట్లు చెబుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షపదవితో పాటు అన్ని కమిటీలపై ఏకాభిప్రాయానికి రావాలన్న యోచన కూడ నాయకత్వం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, కేశ్‌పల్లి ఆనందరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, గోపాల్, మల్లేశ్‌యాదవ్ తదితరులు గ్రూపులకు అతీ తంగా సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగే ఆ పార్టీ కొత్త సార థి ఎన్నికల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో కమిటీలు 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ యత్నం ఫలించలేదు. ఆఖరి నిముషంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యంగా మారింది. జిల్లాలో అప్పటికీ పార్టీ ఒంటిరిగా పోటీ చేసి నెగ్గేంత పటిష్టంగా లేదన్న సాకుతో అధిష్టానం జిల్లా నాయకత్వాన్ని పొత్తులకే సై అనిపించింది. దీంతో పార్టీపై కొండంత ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ బీజేపీ నాయకుల ఆశలు అడియాసలు అయ్యాయి. ఏళ్ల తరబడి ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాల్లో రూ.లక్షలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించిన నేతల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పొత్తులలో భాగంగా 9 అసెంబ్లీ స్థానాలకు నాలుగు చోట్ల పోటీచేసే అవకాశం దక్కినా.. టీడీపీ నేతలు సహకరించక, టీఆర్ఎస్ హవాలో ఓట మి తప్పలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. జిల్లా నాయకు ల్లో నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సభ్యత్వ సేకరణ ద్వారా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వార్డు కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అన్ని స్థాయిల్లో కమిటీలను పటిష్టం చేసే పని పెట్టుకున్నారు. ఇదే క్రమంలో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
22న నరేంద్ర మోడీ రాక
ఎల్లారెడ్డి రూరల్, న్యూస్‌లైన్ : భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ సభకు లక్షలాదిమంది తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అనువైన మూడు స్థలాలను పరిశీలించామని, పార్టీ రాష్ట్ర బాధ్యులు, స్థానిక అధికారులతో చర్చిం చిన అనంతరం స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు. సభను ఉదయం 11గంటలకు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించనున్నామన్నారు. ఆయ న వెంట టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జహీరాబాద్ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మదన్మోహన్రావు, ఎల్లారెడ్డి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, మాజీమంత్రి నెరేళ్ల ఆంజనేయులు తదితరులున్నారు. -
సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యం
నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దేశంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాలేదని, కేవలం కోర్టు ఆదేశాల మేరకే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు. నిజామాబాద్ మండలం ముబారక్‌నగర్, గుండారం, ముదక్పల్లి, గూపన్పల్లి, మల్కాపూర్, లక్ష్మాపూర్ గ్రామాలలో సోమవారం జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి ఈర్ల వసంత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీకి ఓటేసి వసంతను గెలిపించాలని కోరారు. దేశ ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో, రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బీజేపీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందన్నారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదె కృష్ణ, నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శి సూర్యారెడ్డి, గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు రాం సింగ్, మండల అధ్యక్షుడు ఈగ రాజేశ్వర్ రెడ్డి, పద్మారె డ్డి, సాయిలు, పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి, పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సిద్ధం కావాలి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో జిల్లా బీజేపీ నాయకుల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో జిల్లాకు బంగారు భవిషత్తుకై కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బల పర్చాల న్నారు.దేశం మొత్తం మోడీ వైపే చూస్తోం దన్నారు. సంస్థాగతంగా చేపట్టిన ‘ఒక నోటు- బీజేపీకి ఓటు’ కార్యక్రమాన్ని మార్చి 3లోపు పూర్తి చేయాలని శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. త్వరలోనే బూత్ కమిటీలను వేయాలన్నారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు లోక భూపతిరెడ్డి,టక్కర్ హన్మంత్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, కెప్టెన్కరుణాకర్ రెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, మహిళమోర్చా జిల్లా అధ్యక్షులు నాంచారిశైలజ, బీజేపీ నగర అధ్యక్షులు గజం ఎల్లప్ప పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజలంటే చంద్రబాబుకు చులకన: పల్లె గంగారెడ్డి
కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఏళ్లుగా పోరాటాలు చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు, సీమాంధ్రలో 60 రోజుల కృత్రిమ ఉద్యమానికి మాత్రం స్పందించడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదముద్ర పడేదాక అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సీమాంధ్ర ప్రజలు నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014లో జరిగే ఎన్నికల్లో యూపీఏ పాలన, అవినీతి అంశాలే ప్రధానం కానున్నాయని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. దేశంలో 53 యేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగిపోయి ప్రజల విశ్వాసం కోల్పోయింద న్నారు. దేశంలో పేదరికం ఏమాత్రం తగ్గలేదని, ఇందుకు ఉపాధి పనులకు, అమ్మహస్తం కోసం వస్తున్న దరఖాస్తులే నిదర్శనమన్నారు. బీజేపీ వాణిజ్యసెల్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా లాభిషెట్టి రమేశ్ జిల్లా బీజేపీ వాణిజ్యసెల్ సంయుక్త కార్యదర్శిగా కామారెడ్డి పట్టణానికి చెందిన లాభిషెట్టి రమేశ్‌ను నియమించారు. రమేశ్‌కు నియామక పత్రాలను నేతలు అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.