వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో జిల్లా బీజేపీ నాయకుల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో జిల్లాకు బంగారు భవిషత్తుకై కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బల పర్చాల న్నారు.దేశం మొత్తం మోడీ వైపే చూస్తోం దన్నారు.
సంస్థాగతంగా చేపట్టిన ‘ఒక నోటు- బీజేపీకి ఓటు’ కార్యక్రమాన్ని మార్చి 3లోపు పూర్తి చేయాలని శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. త్వరలోనే బూత్ కమిటీలను వేయాలన్నారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు లోక భూపతిరెడ్డి,టక్కర్ హన్మంత్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, కెప్టెన్‌కరుణాకర్ రెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, మహిళమోర్చా జిల్లా అధ్యక్షులు నాంచారిశైలజ, బీజేపీ నగర అధ్యక్షులు గజం ఎల్లప్ప పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధం కావాలి
Published Fri, Feb 28 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement