vinayaka nagar
-
పండుగ పూట విషాదం
* ప్రాణాలు కోల్పోయిన నలుగురు * శోకసంద్రంలో నాలుగు కుటుంబాలు * దీపావళికి ముందు రోజు దుస్సంఘటన * క్రిమినల్ కేసుల నమోదుకు కలెక్టర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పండుగ పూట పెను విషాదం నెలకొంది. నాలుగు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బుధవారం సాయంత్రం నగరంలోని వినాయకనగర్ అశోకా టవర్స్‌లో జరిగిన దుస్సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో ముగ్గురు కూలీలు కాగా, ఒకరు ఆ అపార్ట్మెంట్ వాచ్‌మన్. సెంట్రింగ్ చెక్కలను బయటకు తీయడానికి, మూడు నెలల క్రితం నిర్మించిన ట్యాంకులోకి దిగిన వీరు ఊపిరాడక మృతి చెందారు. ట్యాంకు కొంతకాలం మూసి ఉంచడం వలన అందులో విష వాయువులు వ్యాపించాయని, అందుకే ప్రమాదం జరిగిందని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి మధుసూదన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ట్యాంకులోపల ఆక్సిజన్ శాతం 15 నుంచి 20 వరకు పడిపోయిందని, కార్బన్ మోనాక్సైడ్ ఉద్భవించాయని పేర్కొన్నారు. పాడుబడిన బావులలోనూ, శుభ్రపరచని మురుగు కాల్వలలోనూ ఈ విషవాయు వులు ప్రబలుతాయన్నారు. ట్యాంకు 12 అడుగుల లోతు, 18 అడుగుల వెడల్పుతో ఉంది. మూత చిన్నగా ఉంది. దీంతో దిగినవారు దిగినట్టుగానే ముందుగా స్పృహ కో ల్పోయి, ఆ తరువాత ప్రాణాలు విడిచారు. ట్యాంకులోపల ఉన్న సెంట్రింగ్ చెక్కలు నీళ్లలో నానడంతో కుళ్లిపోయాయని, విషవాయువుల వ్యాప్తికి ఇది కూడా కారణమని భావిస్తున్నారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా జరిగిన ఈ సంఘటన అందరినీ కలిచివేసింది. ‘నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయావా అయ్యా’ అంటూ వాచ్‌మన్ శంకర్ భార్య రోదించడం, ‘అమ్మా నాన్నను లేపు’ అంటూ కొడుకు, కూతురుల రోదించడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు.శంకర్ స్వగ్రామం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెన గ్రామం. బతుకుదెరువు కోసం ఇందూరుకు వలస వచ్చాడు. కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖరరెడ్డి సంఘటనా స్థలాన్ని సం ద ర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అపార్టుమెంటు యజమాని, ఆర్కిటెక్చర్పైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా, అ పార్టుమెంటు నిర్మాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరి చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. వారు సరిగా వ్యవహరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదంటున్నారు. -
మతతత్వపార్టీలకు మద్దతు ఇవ్వకండి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : మతతత్వపార్టీలకు మద్దతు ఇవ్వవద్దని, తమతోనే సమన్యాయం జరుగుతుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదొద్దీన్ఓవైసీ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాకు విచ్చేశారు. నిజామాబాద్‌లోని పులాంగ్ కమిటీ హాలు, కోజాకాల నీ, ముజాహిద్‌నగర్, ఖిల్లారోడ్డులలో బహిరంగసభలు నిర్వహించారు. ఇక్కడ మాట్లాడుతూ అధికా రి పార్టీ తొలిమేయర్ ధర్మపురి సంజయ్ ఐదేళ్లలో కేవలం ఐదుసార్లు మాత్రమే కార్పొరేషన్లో సమావేశం నిర్వహించాడని, ఇదో పెద్ద జోక్ అని అన్నారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నగరంతో పాటు ముస్లిం మైనార్టీ ఏరియాల్లో మౌలి క సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యా రు. తమ పార్టీలో ఎస్సీ, ఎస్టీలతో సహా అన్ని వర్గా ల వారు ఉన్నారని, మాది సెక్యూలర్ పార్టీ అని అన్నారు. అందరూ ఏకం కండి.. తమ అభ్యర్థుల కు ఎక్కువమందిని గెలిపించాలని కోరారు. నెలకొకసారి నిజమాబాద్ వస్తా.. మౌలిక వసతులపై ఆరా తీస్తానని, ప్రజల సౌకర్యాల కోసం పోరాడుతానన్నారు. నగరంలోని పలు చోట్ల ఎంఐఎం పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా బరిలో ఉన్న ఆయన బహిరంగసభలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన ప్రసంగిస్తూ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు మద్దతు ఇవ్వకండి అని ఉద్భోదిం చారు. నగరంలో ఎంఐఎం అభ్యర్థిలను గెలిపించాలని ఆయన కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని తిరిగి ఎన్నుకోకుండా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ బోధన్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదొద్దీన్ బోధన్‌లో రోడ్‌షో నిర్వహించారు. పట్టణంలోని 1, 2, 3, 4, 9,1011,12, 25 వార్డులలో ప్రచారం చేపట్టారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్సిపల్ బరిలో పార్టీ నుంచి పోటీ చేస్తున్న 23 మంది అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీ ఖాలీ అయ్యిందని, బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఎంఐఎంకు వచ్చిందన్నారు. ఆయన వెంట ఎంఐఎం నాయకులు బాబర్, అలీమ్, గంగాధర్ ఉన్నారు. -
ఎన్నికలకు సిద్ధం కావాలి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో జిల్లా బీజేపీ నాయకుల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో జిల్లాకు బంగారు భవిషత్తుకై కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బల పర్చాల న్నారు.దేశం మొత్తం మోడీ వైపే చూస్తోం దన్నారు. సంస్థాగతంగా చేపట్టిన ‘ఒక నోటు- బీజేపీకి ఓటు’ కార్యక్రమాన్ని మార్చి 3లోపు పూర్తి చేయాలని శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. త్వరలోనే బూత్ కమిటీలను వేయాలన్నారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు లోక భూపతిరెడ్డి,టక్కర్ హన్మంత్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, కెప్టెన్కరుణాకర్ రెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, మహిళమోర్చా జిల్లా అధ్యక్షులు నాంచారిశైలజ, బీజేపీ నగర అధ్యక్షులు గజం ఎల్లప్ప పాల్గొన్నారు.