కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఏళ్లుగా పోరాటాలు చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు, సీమాంధ్రలో 60 రోజుల కృత్రిమ ఉద్యమానికి మాత్రం స్పందించడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదముద్ర పడేదాక అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉందన్నారు.
యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సీమాంధ్ర ప్రజలు నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014లో జరిగే ఎన్నికల్లో యూపీఏ పాలన, అవినీతి అంశాలే ప్రధానం కానున్నాయని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. దేశంలో 53 యేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగిపోయి ప్రజల విశ్వాసం కోల్పోయింద న్నారు. దేశంలో పేదరికం ఏమాత్రం తగ్గలేదని, ఇందుకు ఉపాధి పనులకు, అమ్మహస్తం కోసం వస్తున్న దరఖాస్తులే నిదర్శనమన్నారు.
బీజేపీ వాణిజ్యసెల్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా లాభిషెట్టి రమేశ్
జిల్లా బీజేపీ వాణిజ్యసెల్ సంయుక్త కార్యదర్శిగా కామారెడ్డి పట్టణానికి చెందిన లాభిషెట్టి రమేశ్‌ను నియమించారు. రమేశ్‌కు నియామక పత్రాలను నేతలు అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలంటే చంద్రబాబుకు చులకన: పల్లె గంగారెడ్డి
Published Sun, Oct 6 2013 5:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement