‘అమితా’నందం! | Bharatiya Janata Party national president Amit Shaka | Sakshi
Sakshi News home page

‘అమితా’నందం!

Published Fri, Aug 22 2014 1:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘అమితా’నందం! - Sakshi

‘అమితా’నందం!

సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ ైెహ దరాబాద్‌లో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు గురువారం బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో సన్మాన, అభినందన సభ ఘనంగా జరిగింది. సభా వేదికైన సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ జనసంద్రమైంది.

‘భారత్ మాతాకీ జై... వందేమాతరం, జై తెలంగాణ’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు సభా ప్రాంగణంలో హోరెత్తాయి. అమిత్ షాను సన్మానించేందుకు నాయకులు వరుస కట్టడంతో ఒక దశలో వేదికపై తొక్కిసలాట జరిగింది. సభ కు పెద్దసంఖ్యలో జనాలు తరలిరావడం పార్టీ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. సభా ప్రాంగణంలో కిక్కిరిసిన జనాన్ని చూసిన అమిత్ షా మొహంలో ఉత్సాహం తొణికిసలాడింది. తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆయన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నగరంలో మళ్లీ బీజేపీ పట్టు సాధిస్తుందన్న విశ్వాసం ఆయన మాటల్లో ప్రస్ఫుటమైంది.

స్థానిక నాయకులు తమ ప్రసంగాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని తూర్పారబట్టుతూనే... ఎంఐఎం ఎత్తుగ డలను కీలకంగా ప్రస్తావించడం సభికుల ను ఆకట్టుకుంది. కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికల్లో పార్టీ విజయ కేతనం ఎగురవేసి అధికార పగ్గాలను చేపట్టాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు. నేతలు ప్రసంగిస్తున్నంత సేపు భారత్ మాతాకీ జై అన్న నినాదాలు మిన్నుముట్టాయి.
 
బీజేపీని బలోపేతం చేద్దాం: డాక్టర్ లక్ష్మణ్
 
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని ముందుకొచ్చే నాయకులకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీనాయకత్వంలో ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

కరతాళధ్వనుల మధ్య మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతులమీదుగా పార్టీ కండువా క ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌నూ కమలం కండువాను కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎల్‌పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు దిలీప్ కుమార్ ప్రకటించారు.

అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, శంకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకనపల్లి సుజాత, కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ సురేందర్, పీఆర్‌పీ స్టేట్ మాజీ సెక్రటరీ జి.లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శంకర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజేంద్రనగర్ అభ్యర్థి ఉండవల్లి ప్రమీల, శంషాబాద్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ శివరాం నాయక్, మాజీ కార్పొరేటర్ అమర్‌నాథ్, అఖిల భారత ఎల్‌ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకుడు షేక్ షాజహాన్ తదితరలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement