
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్నట్లు ఆ పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, 2019 ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్దం చేసేలా అమిత్‌షా పర్యటన జరగనున్నట్లు చెప్పారు. మంగళవారం పార్టీ నగర కార్యాలయంలో రామచందర్‌రావు అధ్యక్షతన బీజీపీ నగర పదాధికారులు, కన్వీనర్ల సమావేశం జరిగింది.
కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందులో భాగస్వాములైన లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ గౌతమ్‌రావు, జితేంద్ర, రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.