భారతీయ జనతా పార్టీ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీతో ...
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీతో పాటు ఎస్‌డీపీఐ పార్టీలతో కలిసి ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ జి.పరమేశ్వర్ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు పూరైన సందర్భంగా అభినందన సభతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సురాజ్య పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్‌సలో గురువారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ...విభజించి పాలించు అనే సూత్రాన్ని బీజేపీ అనుసరిస్తోందని అన్నారు. అందుకే ఎంఐఎం, ఎస్‌డీపీఐ పార్టీలతో బీజేపీ చేతులు కలిపిందని ఆరోపించారు. స్వాతంత్యాన్రికి పూర్వం, తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మత సామరస్య విధానాన్నే పాటిస్తూ వస్తోందని అన్నారు. ఇదే విధానాన్ని కార్యకర్తలు కూడా కొనసాగించాలన్నారు. సిద్ధరామయ్య నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఉత్తమ పథకాలను మీడియా సైతం ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కావేరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. అరుుతే కావేరి జలాల విషయంలో బీజేపీ చేసిన రాజకీయ కుట్ర సైతం బయట పడాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొరుులీ మాట్లాడుతూ...గతంలో ఎప్పుడూ సర్జికల్ స్టైక్స్ ్రజరగలేదేని హోంమంత్రి మనోహర్ పారికర్ అంటున్నారని, అరుుతే అది నిజం కాదని, గతంలో సర్జికల్ స్టైక్స్ ్రజరిగినప్పటికీ వాటిని ప్రభుత్వం తమ ప్రచారానికి వినియోగించుకోలేదని అన్నారు. ఇదే సందర్భంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ...ప్రజలకు ఉపయుక్తమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరాదని సూచించారు. ఇదే సందర్భంలో పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంతో పాటు, పార్టీపై విమర్శలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్యతో పాటు చాలా మంది బహిరంగ వేదిక పైనే నిద్రలోకి జారుకోవడం గమనార్హం.