సాక్షి, నిర్మల్ : అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం అర్థరాత్రి నిర్మల్‌లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్‌లో ప్రచారానికి వెళ్లకుండా ఉంటే తనకు కాంగ్రెస్ నేతలు రూ.25 లక్షల ఇస్తామని ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిర్మల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మహేశ్వర్‌రెడ్డి అనుచరులు తనకు ఫోన్ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యవద్దని కోరినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.
తనని ఎవరూ కొనలేరని.. మీరు కూడా మోసపోవద్దని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓవైసీ కోరారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని ఆయన ప్రకటించారు. యాంటీ ముస్లిం పార్టీ అయన బీజేపీతో జట్టుకట్టిన టీడీపీతో కాంగ్రెస్ ఎలా చేతులు కలుపుతుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు రెండూ మైనార్టీలకు ద్రోహం చేశాయని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment