'తెలంగాణ'పై బీజేపీ వెనక్కి పోదు: నాగం
2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి జోస్యం చేప్పారు. ఆదివారం హైదరాబాద్లో నాగం మాట్లాడుతూ... రాష్ట్రంలో కూడా తమ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. తెలంగాణ విషయంలో బీజేపీ వెనక్కి పోదని నాగం జనార్దన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
రెండు ఎంపీలు ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, అలాంటి పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చామంటుంది, అయితే తెలంగాణ విషయంలో 160 మంది ఎంపీల మద్దతిచ్చిన బీజేపీ ఏమని చెప్పాలని నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.