సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డిలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామెదర్‌రెడ్డి భేటీ అయ్యారు. దీంతో, దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరగుతోంది. ఇదిలా ఉండగా.. దామోదర్ రెడ్డితో పాటుగా నాగం జనార్ధన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు శనివారం ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇక అదే తేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది.
ఇది కూడా చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment