damodhar reddy
-
TS: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. థాక్రే, రేవంత్‌తో వారిద్దరూ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డిలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామెదర్‌రెడ్డి భేటీ అయ్యారు. దీంతో, దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరగుతోంది. ఇదిలా ఉండగా.. దామోదర్ రెడ్డితో పాటుగా నాగం జనార్ధన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు శనివారం ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అదే తేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. ఇది కూడా చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం -
త్వరలో కాంగ్రెస్ గూటికి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
-
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. దామోదర్‌రెడ్డి ఫిరాయింపునకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని తాము ఫిర్యాదు చేసినా నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన మండలి చైర్మన్ గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి
సాక్షి, నాగర్‌కర్నూల్: టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుడిపల్లి, బొందపల్లి, పెద్దాపూర్, శ్రీపురం, నాగనూల్, నెల్లికొండ, ఎండబెట్లలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఇరువురికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు టీఆర్ఎస్ను గెలిపించాలని, ప్రతీ ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపాంచాలన్నారు. ప్రాణం ఉన్నంత వరకు నాగర్‌కర్నూల్ ప్రజలకు సేవచేసుకుంటానన్నారు. మరోమారు కాంగ్రెస్ నాయకులు ఓట్లకోసం ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ మాయా కూటమి మరోమారు మోసగించేందుకు ముందుకువచ్చారని.. వారిని నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ యాదవ్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. తెలకపల్లి: మండలంలోని దాసుపల్లి, లక్నారంలో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జమున ఇంటింటి ప్రచారం చేశారు. దాసుపల్లి, లక్నారంలో ఇంటింటికి వెళ్లి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. నియోజకవర్గాన్ని మర్రి జనార్దన్‌రెడ్డి అభివృద్ధి చేశారని, సొంత ఖర్చులతో కాల్వలు తీసి కేఎల్ఐ నీరందించారన్నారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్నిరకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆమెవెంట తెలకపల్లి మాజీ సర్పంచ్ నిర్మల లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ నరేందర్‌రెడ్డి, భాగ్యమ్మ, నర్మద, రాజేందర్‌రెడి పాల్గొన్నారు. కళ్లముందున్న అభివృద్ధిని చూడండి నాగర్‌కర్నూల్: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాగర్‌కర్నూల్‌లో జరిగిన, కళ్లముందున్న అభివృద్ధిని చూడాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జమున అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. మర్రి జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో ఉన్న చనువుతో నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తేవడం జరిగిందన్నారు. గతంలో ఉన్న నాయకులు చేయలేని అభివృద్ధి పనులు కూడా చేయించారన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు మర్రిని గెలిపించాలన్నారు. ఆమె వెంట పట్టణానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. తాడూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. నాలుగున్నర ఏళ్ల నుంచి నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదని టీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అందేవిధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మరోసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. తిమ్మాజిపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని తిమ్మాజిపేట, మరికల్, పుల్లగిరి, ఆర్సీ తండా, అవంచ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్కే ఒటేయ్యాలని ప్రజలను కోరారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరోసారి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. వేణుగోపాల్‌గౌడ్, ప్రదీప్, స్వామి, కోటీశ్వర్, వెంకటేష్, శ్రీను, అబ్దుల్ఆలీ, వహీద్ పాల్గొన్నారు. -
‘ఆ అంశంలో ఉత్తమ్ తప్పు చేశారు’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో విబేధాలు బయటపడుతున్నాయి. తెలంగాణ పీసీసీపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర పీసీసీ తన సానుకూల వర్గాన్ని ఒకలా.. వ్యతిరేక వర్గాన్ని మరోలా చూస్తోందని ఆయన ఆరోపించారు. నాగం జనార్థన్ రెడ్డి పార్టీలో చేరికపై తమతో సంప్రదిస్తామని చెప్పారు కానీ ఆతర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నాగం అంశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి తప్పు చేశారని, వర్గ విబేధాల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదన్నారు. నాగర్ కర్నూల్లో బలమైన నాయకులను దెబ్బతీసేందుకే జైపాల్‌రెడ్డి, చిన్నా రెడ్డిలు ప్రయత్నిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీకి తప్పడు సమాచారం ఇచ్చి నాగం పార్టీలో చేరాలా చేశారని ఆరోపించారు. జైపాల్ రెడ్డి.. రాజీవ్ గాంధీని ఉరితీయాలని చెప్పిన వ్యక్తి అని మండిపడ్డారు. తనపై పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. నాగం పార్టీ కోసం పని చేస్తే సరేకానీ టికెట్ ఇస్తే తాము ఏం చేయాలో అది చేస్తామన్నారు. టికెట్ ఖాయం చేసినట్టు నాగం చెప్పుకుంటున్నారని, కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పీసీసీ, కుంతియా అంటున్నారన్నారు. దీనిపై మీడియా ముందు స్పష్టం చేయాలన్నారు. 20 ఏళ్ళుగా పార్టీ కోసం , నాగంకు వ్యతిరేకంగా పోరాటం చేశామని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు నాగం వర్గమే పుకార్లు చేస్తుంది.. ఆయనకు టికెట్ ఇస్తే తాను సహకరించనని దామెదర్‌రెడ్డి తేల్చిచెప్పారు. -
మాజీ సైనికుడి దారుణ హత్య
సదాశివపేట, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన మాజీ సైనికుడు మహ్మద్ రఫీక్ బాబా (65) సదాశివపేట మండలం కోనాపూర్ సమీపంలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ దామోదర్‌రెడ్డి కథనం మేరకు.. హఫీజ్‌పేటకు చెందిన సోఫీ, మాజీ సైనికుడు రఫీక్ కలిసి కోనాపూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ భూమిని ఇటీవలె కొనుగోలు చేశారు. అయితే సదరు భూమిని తనకు చూపాలని సోఫీ కుమారుడు హఫాన్ మూడు రోజుల క్రితం రఫీక్‌ను కోరాడు. ఇందుకు రఫీక్ శుక్రవారం ఉదయం వెళదామని తెలిపాడు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం రఫీక్ ఇంటి నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కారులో డ్రైవర్ గఫార్‌తో కలిసి సదాశివపేటకు బయలు దేరారు. హఫీజ్‌పేట వద్ద హఫాన్ను కారులో ఎక్కించుకున్నాడు. కోనాపూర్‌లోని బసవలింగ ఆశ్రమం వద్ద కారు ఆపారు. అనంతరం ఇటీవల కొనుగోలు చేసిన భూమిని హఫాన్కు చూపేందుకు రఫీక్ ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లాక హఫాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రఫీక్ మెడపై బలంగా పొడిచి పరారయ్యాడు. దీనిని గమనించిన సమీప పంట పొలాలకు చెందిన రైతులు పలువురు విషయాన్ని కారు డ్రైవర్ గఫార్‌కు తెలిపారు. దీంతో గఫార్.. రఫీక్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే రఫీక్ మృతి చెందడంతో సమాచారాన్ని సెల్‌ఫోన్ ద్వారా మృతుడి కుమారుడు హతిక్ వివరించారు. తమకూ సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించినట్లు సీఐ తెలిపారు. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్‌కు సమాచారాన్ని చేరవే సినట్లు ఆయన వివరించారు. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు హతిక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు హఫాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.