మాజీ సైనికుడి దారుణ హత్య | Ex-soldier grievous murder | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుడి దారుణ హత్య

Published Sat, Nov 16 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Ex-soldier grievous murder

సదాశివపేట, న్యూస్‌లైన్ :  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆస్‌బెస్టాస్ కాలనీకి చెందిన మాజీ సైనికుడు మహ్మద్ రఫీక్ బాబా (65) సదాశివపేట మండలం కోనాపూర్ సమీపంలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ దామోదర్‌రెడ్డి కథనం మేరకు..  హఫీజ్‌పేటకు చెందిన సోఫీ, మాజీ సైనికుడు రఫీక్ కలిసి కోనాపూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ భూమిని ఇటీవలె కొనుగోలు చేశారు. అయితే సదరు భూమిని తనకు చూపాలని సోఫీ కుమారుడు హఫాన్ మూడు రోజుల క్రితం రఫీక్‌ను కోరాడు. ఇందుకు రఫీక్ శుక్రవారం ఉదయం వెళదామని తెలిపాడు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం రఫీక్ ఇంటి నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కారులో డ్రైవర్ గఫార్‌తో కలిసి సదాశివపేటకు బయలు దేరారు. హఫీజ్‌పేట వద్ద హఫాన్‌ను కారులో ఎక్కించుకున్నాడు. కోనాపూర్‌లోని బసవలింగ ఆశ్రమం వద్ద కారు ఆపారు.

అనంతరం ఇటీవల కొనుగోలు చేసిన భూమిని హఫాన్‌కు చూపేందుకు రఫీక్ ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లాక హఫాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రఫీక్ మెడపై బలంగా పొడిచి పరారయ్యాడు. దీనిని గమనించిన సమీప పంట పొలాలకు చెందిన రైతులు పలువురు విషయాన్ని కారు డ్రైవర్ గఫార్‌కు తెలిపారు. దీంతో గఫార్.. రఫీక్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే రఫీక్ మృతి చెందడంతో సమాచారాన్ని సెల్‌ఫోన్ ద్వారా మృతుడి కుమారుడు హతిక్ వివరించారు. తమకూ సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించినట్లు సీఐ తెలిపారు. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్‌కు సమాచారాన్ని చేరవే సినట్లు ఆయన వివరించారు. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు హతిక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు హఫాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement