
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జలదీక్షకు వెళ్తున్న నాగంను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కోరితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాగా మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment