
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డిలను అరెస్ట్ చేశారు. భద్రాచలం దుమ్ముగూడెం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను పోలీసులు అడ్డుకోవడంతో వైరాలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
దుమ్ముగూడెంలో ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా వీహెచ్‌ను, దేవాదుల ప్రాజెక్టుకు వెళ్తుండగా ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్షను ఎక్కడికక్కడ పోలీసులు భగ్నం చేస్తున్నారు. సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment