Jala diksha
-
కాంగ్రెస్ జలదీక్ష భగ్నం..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డిలను అరెస్ట్ చేశారు. భద్రాచలం దుమ్ముగూడెం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను పోలీసులు అడ్డుకోవడంతో వైరాలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దుమ్ముగూడెంలో ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా వీహెచ్‌ను, దేవాదుల ప్రాజెక్టుకు వెళ్తుండగా ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్షను ఎక్కడికక్కడ పోలీసులు భగ్నం చేస్తున్నారు. సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. -
నూజివీడులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు
నూజివీడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైయ్యాయి. నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలలో మున్సిపల్ చైర్పర్సన్ బసవ రేవతి, కౌన్సిలర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రాప్తాడు ధర్నాకు పోలీసులు నో
రాప్తాడు(అనంతపురం): కర్నూలులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రాప్తాడు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తుండగా రాప్తాడులో మాత్రం పోలీసులు అనుమతించక పోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.