
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్భంధం చేయడం అప్రజస్వామికమని ఇంతకమటే దారుణం మరొకటి ఉండదన్నారు. మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (జగదీష్ రెడ్డి మంత్రి హోదాను మరిచిపోయారు)
కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకుల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తాము చేసుకునే కార్యక్రమాలను అడ్డుకోకూడదని ఉత్తమ్ అన్నారు. మాట్లాడితే అరెస్టులు చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం రోజు హక్కులు కాలరాస్తే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతోందని విమర్శించారు. (కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!)
నియంత పోకడలకు నిదర్శనం: కోమటిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌లను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) దగ్గర దీక్షా కార్యక్రమం రద్దు చేసుకొని సందర్శనకు మాత్రమే వెళదామని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఇళ్ల ముందు నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంత పోకడలకు ఈ అరెస్ట్‌లు నిదర్శనమన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జలదీక్షకు సిద్దమైన విషయం తెలిసిందే. (జూన్ 2న కాంగ్రెస్ శ్రేణుల దీక్ష)
Comments
Please login to add a commentAdd a comment