బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్మస్వామి పరధ్యానంలో పచ్చని పెళ్లి పందిట్లో కలకలం రేపారు. తమిళనాడులోని తిరునల్వెలిలో బుధవారం ఆయన ఓ పెళ్లికి హాజరయ్యారు. తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించాలని పెద్దలు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. పరధ్యానంలో ఉన్న ఆయన తాళి బొట్టును తీసుకొని ఏకంగా పెళ్లికూతురు మెడలో కట్టేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారికి అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాలు అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న ఓ పెద్దావిడ మంగళసూత్రం కట్టకుండా ఆయనను నిలువరించింది. తాను పరధ్యానంతో చేసిన చర్యకు స్వామి కాస్త సిగ్గుపడి నవ్వుకున్నారు. ఆయన చర్యలతో పెళ్లికి వచ్చిన అతిథులు, వధూవరుల కుటుంబసభ్యులు ఈ సంఘటనతో షాక్ తిన్నారు.