ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు ఆదివారం నగరంలో సంబరాలు చేసుకున్నారు.
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు ఆదివారం నగరంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య ఆధ్వర్యంలో ముఖ్య కూడళ్లలో బాణసంచా పేల్చి,స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందని, ప్రజలపై మోయలేని భారాలను వేసిందని అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించానలి అన్నారు.
2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. నాలుగు రాష్ట్రాలే కాకుండా రాబోయే రోజుల్లో జరిగే శాసనసభ పార్లమెంటు సభ్యుల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాళింగి నరసింహవర్మ, చల్లా దామోదర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటు కన్వీనర్ నక్కలమిట్ట శ్రీనివాసులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందడి సుధాకర్,రంగస్వామి, మధున మోహన్ చారి తదితరులు పాల్గొన్నారు.