మధ్యప్రదేశ్‌లో మెజారిటీకి అవసరమైన సీట్లను బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుందని బుధవారం ఒక సర్వే వెల్లడించింది.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో మెజారిటీకి అవసరమైన సీట్లను బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుందని బుధవారం ఒక సర్వే వెల్లడించింది. ఏబీపీ న్యూస్- దైనిక్ భాస్కర్- నీల్సన్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ 41 శాతం ఓట్లతో 155 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. 33 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లలో గెలుపు సాధిస్తుందని తెలిపింది. బహుజన్ సమాజ్ పార్టీకి 6 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎంపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం చౌహాన్ పనితీరును ‘చాలా బావుంది’ అని పేర్కొనగా, 80 శాతం బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు.