ఓపీ రావత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రం అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతలు పదే పదే తమ పనిలో జోక్యం చేసుకుంటురని, ఎన్నికలు ఎలా నిర్వహించాలో తమకు తెలుసని సీఈసీ వ్యాఖ్యానించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని.. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈసీని అదేశించింది.
మంగళవారం దీనిపై అఫడవిట్ దాఖలు చేసిన ఈసీ.. కాంగ్రెస్ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో్ అక్రమాలు చోటుచేసుకున్నట్లు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. తమ విధులను తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంను కోరింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఎన్నికలు పారదర్శకంగా వ్యవహరించాలని ఎలా కోరతారని ఈసీ ప్రశ్నించింది. కాగా మధ్యప్రదేశ్‌లో 60 లక్షలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని పిటిషన్ తరుఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనానికి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment