కమలనాథుల పోటాపోటీ | Strategies aims presidential Positions | Sakshi
Sakshi News home page

కమలనాథుల పోటాపోటీ

Published Tue, Nov 8 2016 2:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

కమలనాథుల   పోటాపోటీ

కమలనాథుల పోటాపోటీ

అధ్యక్ష పదవులు దక్కించుకునేందుకు వ్యూహాలు
10, 11, 12 తేదీలలో జిల్లా కమిటీల ఎన్నికలు
ఎవరికివారుగా ప్రయత్నాలు
అవసరమైతే ఎన్నికలకు వెళ్లే యోచన

వరంగల్ : భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నారుు. అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతలు ఎవరికివారుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలోనే కొత్త జిల్లాకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ ఐదు జిల్లాల కమిటీల నియామకం కోసం నవంబర్ 10, 11, 12 తేదీల్లో ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణరుుంచింది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు ఎక్కువగానే  ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎక్కువ మంది నేతలు అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థారుు ముఖ్యనేతల పరిచయాలతో జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో పోటీ ఇంకా ఎక్కువగా ఉంది. పోటీ ఎక్కువగా ఉండడంతో ఆశావహులు ఏ అవకాశాన్నీ వదుకోవడం లేదు. ప్రత్యర్థుల బలహీనతలను, తమ బలాలను అధిష్టానానికి నివేదిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో అవసరమైతే ఎన్నికలకు సిద్ధమేనని పలువురు ఆశావహులు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఏకగ్రీవంగానే అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రచిస్తోంది.

కొత్తగా ఏర్పడిన ఐదు జిల్లాలను పరిశీలిస్తే వరంగల్ అర్బన్ జిల్లాలో బీజేపీకి సంస్థాగతంగా కొంత బలం ఉంది. భవిష్యత్‌లో జరగనున్న ఎన్నికల్లో కొంత వరకై నా బలం నిరూపించుకునే అవకాశం ఈ జిల్లాలోనే ఉండనుంది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లాలో అధ్యక్ష పదవి కోసం ఎక్కువ మంది నేతలు పోటీపడుతున్నారను. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎడ్ల అశోక్‌రెడ్డిని వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దొంతి దేవేందర్‌రెడ్డి, గుజ్జ సత్యనారాయణరావు, శ్రీరాముల మురళీమనోహర్ ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.

జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్‌ఎన్ రెడ్డి, సీనియర్ నేతలు పెదగాని సోమయ్య, నెల్లుట్ల నర్సింహారావు, కొంతం శ్రీనివాస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవిని బీజేపీ సీనియర్ నేతలు వెన్నంపల్లి పాపయ్య, నాగపురి రాజమౌళి, కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి ఆశిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం యాప సీతయ్య, జి.లక్ష్మణ్ నాయక్, బానోత్ దిలీప్ నాయక్, గాదె రాంబాబు, వద్దిరాజు రాంచందర్‌రావు, పూసల శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement