
'ఆ రెండు పార్టీలు తెలుగుతల్లిని హత్య చేశాయి'
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు రెండు అసాంఘిక శక్తుల మాదిరిగా రాష్ట్రాన్ని చీకట్లో విభజించాయని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ... తెలుగుతల్లి హత్యలో ఆ రెండు పార్టీల ప్రమేయం ఉందని ఆరోపించారు. కేవలం ఓట్లు - సీట్లు కోసమే విభజనకు పాల్పడ్డాయని అన్నారు.
విభజనపై సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం సమైక్యవాదుల విజయంగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ బెంచ్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటుందని ఉండవల్లి జ్యోసం చెప్పారు.