
సాక్షి: కేరళ ముఖ్యమంత్రి విజయన్ భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెంగర ఉపఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కేరళతో పెట్టుకోవద్దు' అంటూ హెచ్చరించారు.
అంతేకాకుండా బీజేపీ చేపట్టిన జన రక్షా యాత్రపై విమర్శలు ఎక్కుపెట్టారు. నెలరోజల పాటు చేపట్టిన యాత్ర దండగ అంటూ దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో గెలవడానికి మత ఛాందసవాదాన్ని ఆడ్డుపెట్టుకొని పాటు నీచ రాజకీయాలకు దిగిందని బీజేపీపై విరుచుపడ్డారు. అయితే ప్రజలు బుద్ది చెప్పారని అందుకే నాలుగోస్థానానికి పడిపోయిందని విమర్శించారు. ఇప్పటికైన కేరళతో బీజేపీ పెట్టుకోవద్దని, ఇది వారికి బలమైన హెచ్చరిక అని విజయన్ సూచించారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలో బీజేపీ కేరళ పర్యాటక రంగాన్ని దెబ్బతీసేలా విష ప్రచారం చేస్తున్నారని విజయన్ మండిపడ్డారు. బాయ్‌కాట్ కేరళ పేరుతో పర్యాటకులు రాకుండా బీజేపీ నేతలు కుట్రలతో అడ్డుకుంటాన్నారని ఆయన ఆరోపించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంశంపై ప్రసంగించిన ఆయన ఇలాంటి అసత్య వార్తలను కేరళ ప్రజలు, పర్యాటకులు నమ్మెద్దని ముఖ్యమంత్రి కోరారు.