ప్రధాని మన్మోహన్ ముందే చేతులెత్తేశారు!
ప్రధాని మన్మోహన్ ముందే చేతులెత్తేశారు!
Published Fri, Jan 3 2014 2:59 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ఓటమిని ముందే ఒప్పుకున్నారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం లేదని ప్రధాని మాటల్తో తేలిపోయింది అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధాని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజ్ నాథ్ అన్నారు. మోడీ తన ప్రభుత్వ హయంలో గుజరాత్ ను మోడల్ స్టేట్ గా రూపొందించారు అని అన్నారు.
2002 సంవత్సరంలో జరిగిన సంఘటన అత్యంత విషాదకరం అని రాజ్ నాథ్ అన్నారు. అయితే గోద్రా సంఘటనలో మోడీకి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది అని తెలిపారు. ఎన్ డీఏ హయంలో దేశ ఆర్ధిక వృద్ది 8.4 శాతంతో మెరుగ్గా ఉండిందని.. అయితే యూపీఏ ప్రభుత్వ కాలంలో దారుణంగా పడిపోయింది అని రాజ్ నాథ్ అన్నారు. అంతేకాక మన్మోహన్ హయాంలో దేశ అంతర్గత భద్రత పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది అని విమర్శించారు.
Advertisement
Advertisement